Peddi: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది ఒకటి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా బుచ్చిబాబు ఈ సినిమాలో రామ్ చరణ్ ని చూపించే విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అలానే ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ షాట్ వీడియో కూడా మంచి అంచనాలను పెంచింది. రామ్ చరణ్ 18 సంవత్సరాలు ఇండస్ట్రీలో పూర్తి చేసుకున్న సందర్భంగా వదిలిన పోస్టర్ కూడా మంచి అంచనాలను నెలకొల్పింది. ఇక తాజాగా ఈ సినిమా గురించి టాప్ సీక్రెట్స్ రివీల్ చేసింది జాన్వీ కపూర్.
పెద్ది సినిమాలో నా పాత్ర ఒక బ్లాస్ట్, ఈ సినిమాలో నాది వెరీ డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. బుచ్చిబాబు రూటెడ్ డైరెక్టర్. మీరు ఉప్పెన సినిమా చూసే ఉంటారు. అది చాలా మంచి సినిమా. బుచ్చిబాబుకి అద్భుతమైన విజన్ ఉంది. నాకోసం అటువంటి హీరోయిన్ క్యారెక్టర్ రావడం అనేది నా అదృష్టం. రామ్ చరణ్ సార్ వెరీ జెంటిల్ మ్యాన్. ఆయనకు విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. ఆయన చాలా పెద్ద స్టార్ హీరో. కానీ సెట్స్ కి వచ్చినప్పుడు మాత్రం చిన్నపిల్లాడిలా నేర్చుకుంటూనే ఉంటాడు.
రామ్ చరణ్ తేజ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా రంగస్థలం సినిమాకి ఉన్న స్థాయి వేరు స్థానం లేరు. రామ్ చరణ్ లోని పరిపూర్ణమైన నటుడును బయటకు తీసిన సినిమా రంగస్థలం. చిట్టిబాబు అనే పాత్రలో చరణ్ ఇమిడిపోయే విధానం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. యాక్టింగ్ రాదు అనే కామెంట్ చేసిన వాళ్ళకి ఆ సినిమా ఒక సమాధానం అయింది.
ఇప్పుడు పెద్ది సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ ఈ సినిమా లో తన పర్ఫామెన్స్ తో అందర్నీ సప్రైజ్ చేస్తారట. కేవలం యాక్టింగ్ లోనే కాకుండా ఉత్తరాంధ్ర యాస ను కూడా పర్ఫెక్ట్ గా పట్టుకున్నాడు అని తెలుస్తుంది. రంగస్థలం లో గోదావరి యాస తో ప్రేక్షకులను అలరించాడు. ఒక స్టార్ హీరో ఇలా యాసలు మాట్లాడటం అనేది చాలామందికి సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది.
Also Read: Kantara Chapter1 : వివాదంపై స్పందించిన రిషబ్ శెట్టి, అప్పుడు తెలుగులో మాట్లాడుతా