PCB : ఆసియా కప్ 2025 ఫైనల్ లో పాకిస్తాన్ జట్టు టీమిండియా చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ ఆటగాళ్లు టీమిండియా చేతిలో ఓటమి పాలయ్యారని వారికి పీసీబీ శిక్ష విధించింది. విదేశీ టీ-20 లీగ్స్, టోర్నమెంట్లలో ఆడేందుకు ఇచ్చిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది. తిరిగి ఆ దేశాలు ఇచ్చేంత వరకు NOC లను హోల్డ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయానికి ప్రత్యేకమైన కారణం ఏమి చెప్పలేదు. ముందు అంతర్జాతీయంగా నిరూపించుకోండి. ఆ తరువాత లీగ్ లు ఆడుదురు అని పరోక్షంగా మెసెజ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Also Read : Tilak Varma: సీఎం రేవంత్ కు తిలక్ వర్మ క్రేజీ గిఫ్ట్…నారా లోకేష్ ఒక్కడికే కాదు !
మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లను మాజీ ఆటగాళ్లు తిడుతున్నారట. ఇక సోషల్ మీడియాలో అయితే విమర్శలకు అయితే కొదవేలేదు. ఇలాంటి దశలో పుండు మీద కారం చల్లినట్టు పీసీబీ వాళ్లకు షాక్ ఇచ్చింది. పీసీబీ నిర్ణయంతో ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్ గురయ్యారట. వాస్తవానికి పీసీబీ మొదటి నుంచి ఆటగాళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కోచింగ్ విషయంలో కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏకపక్ష ధోరణీ కొనసాగిస్తూ వస్తోంది. మేనేజ్ మెంట్ పెత్తనాలు ముఖ్యంగా పెరిగిపోయాయి. కోచ్ లు నిలకడగా ఉండలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆటగాళ్లు కూడా ఎవరికీ నచ్చినట్టు వాళ్లు వ్యవహరించడం గమనార్హం. ఒక్కో ఆటగాడు తన తోటి ఆటగాడి పై విమర్శలు చేసుకోవడంతో వారు చాలా చులకనగా మారుతున్నారు. ముఖ్యంగా టీమిండియా జట్టు అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతోంది. పాకిస్తాన్ కాదు.. ఆస్ట్రేలియా జట్టునైనా ఓడిస్తోంది టీమిండియా.
అలాంటిది టీమిండియా చేతిలో ఓడిపోయినంత మాత్రాన ఒకేసారి అంతటి కఠిన శిక్ష విధించాలా..? అసలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు ప్రశాంతత లేకుండా చేస్తుందా..? పాకిస్తాన్ అంటేనే అదో టైప్ అన్నట్టు వ్యవహరిస్తోంది కదా..? అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.వాస్తవానికి పాకిస్తాన్ ఆటగాళ్లు గెలుపుకోసం చాలా శ్రమించారు. ఓపెనర్లు అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. కానీ చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో తక్కువ స్కోర్ కే ఆలౌట్ అయింది. అక్కడ టీమిండియా బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. అలాగే టీమిండియాను తొలి మూడు ఓవర్లలోనే మూడు వికెట్లను తీశారు. దీంతో టీమిండియా ఓడిపోతుందనుకున్న సమయంలో తిలక్ వర్మ వచ్చి కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తెలుగు రాష్ట్రానికి చెందిన తిలక్ వర్మ రాత్రికి రాత్రే టీమిండియా హీరోగా మారిపోయాడు. కీలక సమయంలో ఇండియాను విజయతీరాలకు చేర్చాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలో రాణించడంతో టీమిండియా గెలిచింది. పాకిస్తాన్ కూడా పోరాడి ఓడింది. కానీ పీసీబీ వారికి కఠిన శిక్షను విధించడం విశేషం. ఒకవేళ టీమిండియా ఓడిపోయినా కానీ బీసీసీఐ మాత్రం అలా చేయదు అని ఇండియా ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.