UGC NET 2024 Applications: యూజీసీ నెట్ 2024 దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడగించింది. అయితే మే 10తో గడువు ముగియాల్సి ఉండగా..దానిని మే 15 వరకూ పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.
దేశంలోని వివిధ యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడేందుకు, పీహెచ్ డీ చేసేందుకు ఇది ఎంతో కీలకమైన పరీక్ష. యూజీసీ నెట్ లో అత్యధిక మార్కులతో పాస్ అయిన వారికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా లభిస్తుంది.
83 సబ్జెక్టులు: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మొత్తం 83 సబ్జెక్టులకు ఈ నెట్ పరీక్షను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరంలో రెండు సార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు. అయితే ఈ సారి యూజీసీ నెట్ పరీక్షను జూన్ 16న నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ తెలిపింది. అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.nic.in.ద్వారా అప్లై చేసుకోవచ్చు.
విద్యార్హతలు: అభ్యర్థులు 55 % మార్కులతో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయో పరిమితి: జేఆర్ఎఫ్ పొందాలంటే అభ్యర్థుల వయస్సు 2024 జూన్ 1 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీకి ఎలాంటి గరిష్ట వయో పరిమితి లేదు.
Also Read: తీహార్ జైలుకు బాంబు బెదిరింపు.. ఢిల్లీలో హై అలర్ట్
దరఖాస్తులు ప్రారంభం: 2024 ఏప్రిల్ 20 , 2024
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 15, 2024
అప్లికేషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: మే 17, 2024
దరఖాస్తు సవరణ తేదీలు:మే 18 నుంచి 20
పరీక్ష తేదీ: జూన్ 16, 2024