BigTV English

ICMR About Tea And Coffee: ఐసీఎంఆర్ హెచ్చరిక.. భోజనం ముందు లేదా తర్వాత టీ, కాఫీలు అస్సలు తాగకూడదట..

ICMR About Tea And Coffee: ఐసీఎంఆర్ హెచ్చరిక.. భోజనం ముందు లేదా తర్వాత టీ, కాఫీలు అస్సలు తాగకూడదట..

ICMR About Tea And Coffee: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల భారతీయుల కోసం 17 ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆరోగ్యకరమైన జీవనంతో పాటు సమతుల్య, విభిన్నమైన ఆహారం కోసం కొన్ని సూచనలు చేస్తూ నివేదికను విడుదల చేసింది. ఈ మేరకు ఐసీఎంఆర్ విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఒకదానిలో, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) పరిశోధన విభాగంతో కూడిన మెడికల్ ప్యానెల్ టీ, కాఫీ వినియోగం గురించి పేర్కొంది.


భారతదేశంలో నివసించే చాలా మంది ప్రజలు తరచూ టీ, కాఫీలు తాగడానికి అలవాటు పడినట్లు పేర్కొంది. అయితే టీ లేదా కాఫీని భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకోవడం ప్రమాదం అని హెచ్చరించింది. టీ, కాఫీలలో కెఫిన్ ఉంటుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుందని స్పష్టం చేసింది. అయితే టీ, కాఫీలను పూర్తిగా మానేయమని చెప్పకపోయినా కూడా వాటిలో ఉండే కెఫిన్ కంటెంట్ నుంచి జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

ఒక కప్పు బ్రూ కాఫీలో 80 నుంచి 120 గ్రాముల కెఫిన్ ఉంటుంది. అదే ఇన్ స్టంట్ కాఫీలో 50 నుంచి 65 మిల్లీ గ్రాములు, టీలో 30 నుంచి 65 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుంది. అయితే టీ లేదా కాఫీలను ఎంత తక్కువగా తాగితే ఆరోగ్యానికి అంత మంచిది అని పేర్కొంది. ముఖ్యంగా భోజనానికి ముందు లేదా తర్వాత టీ, కాఫీలు అస్సలు తాగకూడదని హెచ్చరించింది. ఒక వేళ తాగాలని అనుకున్న భోజనానికి గంట ముందు గంట తర్వాత తీసుకోవాలని పేర్కొంది.


పానీయాలలో టానిన్ సమ్మేళనం ఉంటుంది. అందువల్ల టానిన్లు శరీరంలోని ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయని తెలిపింది. అంతే టానిన్ శరీరంలో ఉండే ఐరన్ కంటెంట్‌ను తగ్గించేలా చేస్తుంది. టానిన్ వల్ల జీర్ణాశయంలోని ఐరన్ తగ్గిపోతుంది. అంతేకాదు ఆహారం ద్వారా రక్తంలో ప్రవేశించే ఐరన్ కూడా తగ్గుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ ను తయారు చేసేందుకు ఐరన్ అనేది అవసరం. అందువల్ల ఐరన్ స్థాయిలను తగ్గించేలా పనిచేసే కాఫీలను తీసుకోవడం ప్రమాదం అని పేర్కొంది.

Tags

Related News

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Dengue Fever: వర్షాకాలంలో జ్వరమా ? డెంగ్యూ కావొచ్చు !

Big Stories

×