E-Paper
Advertisement

Union Budget 2026: 10 వేల మంది టూరిస్ట్ గైడ్‌లకు శిక్షణ.. ఆరోగ్య, నైపుణ్య రంగాలకు భారీగా కేటాయింపు

Union Budget 2026:  10 వేల మంది టూరిస్ట్ గైడ్‌లకు శిక్షణ.. ఆరోగ్య, నైపుణ్య రంగాలకు భారీగా కేటాయింపు

Union Budget 2026: కేంద్ర బడ్జెట్ లో బయో-ఫార్మా రంగ అభివృద్ధి, ఆరోగ్య, నైపుణ్య రంగాలకు రూ.10 వేల కోట్లు కేటాయించారు. ఫార్మాస్యూటికల్ విద్య, క్లినికల్ ట్రైనింగ్, రీసెర్చ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఈ నిధులు ఉపయోగించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే మూడు కొత్త నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER) ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దీంతో నైపర్ సంస్థలు 10కి పెరుగుతుంది. అధునాతన శిక్షణ, పరిశోధన సామర్థ్యాలు, పరిశ్రమ సహకారాలను పెంచడానికి ఇప్పటికే ఉన్న ఏడు NIPER లను అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించారు. ఈ రంగాల్లో కెరీర్ అవకాశాలను పెరగనున్నాయి.

లక్ష మందికి శిక్షణ

ఎలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ (AHP) విద్యను ఆప్టోమెట్రీ, అనస్థీషియా టెక్నాలజీ, అప్లైడ్ సైకాలజీ , బిహేవియరల్ హెల్త్‌తో సహా 10 విభాగాలను విస్తరించనున్నారు. ఐదు సంవత్సరాలలో లక్ష మంది నిపుణులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి అనుబంధంగా ప్రభుత్వం వృద్ధాప్య, దీర్ఘకాలిక సంరక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని భావిస్తుంది. వెల్నెస్, యోగా ప్రాక్టీషనర్లు సహా 1.5 లక్షల మంది మల్టీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

కార్పొరేట్ మిత్ర

సాంప్రదాయ వైద్యం, మానసిక హెల్త్ ఎడ్యుకేషన్ పై దృష్టి పెట్టాలని కేంద్ర నిర్ణయించింది. ఈ రంగంలో నైపుణుల సంఖ్యను పెంచడానికి మూడు నూతన అఖిల భారత ఆయుర్వేద సంస్థలను స్థాపించనున్నారు. నార్త్ ఇండియాలో రెండో నిమ్హాన్స్ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. రాంచీలో మానసిక ఆరోగ్య సంస్థను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ICAI, ICSI, ICMAI వంటి సంస్థలు “కార్పొరేట్ మిత్ర” కేడర్‌ను సృష్టించడానికి మాడ్యులర్ కోర్సులు, టూల్‌కిట్‌లను అభివృద్ధి చేయనున్నారు. స్థానిక వ్యాపారాలకు అకౌంటింగ్, కార్పొరేట్ పాలనలో నైపుణ్యాన్ని అందించనున్నారు.

ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్

ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయనున్నారు. 15,000 పాఠశాలలు, 500 కళాశాలలలో కంటెంట్ క్రియేషన్ ల్యాబ్‌లను ప్రవేశపెట్టనున్నారు. శిక్షణ పొందిన డిజైనర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈశాన్య రాష్ట్రాల్లో నూతన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జిల్లాలో మహిళా భాగస్వామ్యంతో బాలికల హాస్టల్‌ను ఏర్పాటు చేస్తారు. భారీ సౌర టెలిస్కోప్, హిమాలయన్ చంద్ర టెలిస్కోప్, COSMOS-2 ప్లానిటోరియం వంటి నాలుగు ప్రధాన సౌకర్యాలతో అంతరిక్ష శాస్త్రం, పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.

Also Read: చౌకైన బ్యాటరీలు, CNG బ్లెండింగ్.. ఆటో ఇండస్ట్రీకి బడ్జెట్ బూస్టింగ్!

10 వేల టూరిస్ట్ గైడ్ లకు శిక్షణ

టూరిజం, క్రీడా, విద్య నైపుణ్యాల అభివృద్ధికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యా కార్యక్రమాలను అప్ గ్రేడ్ చేయనున్నారు. IIMల సహకారంతో 20 ఐకానిక్ ప్రదేశాలలో 10,000 మంది టూరిస్ట్ గైడ్‌లకు శిక్షణ ఇచ్చే పైలట్ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. ICAR నేతృత్వంలో AI సాయంతో విద్య, వ్యవసాయం, గ్రామీణ జీవనోపాధి రంగాల అనుసంధానం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు, గ్రామాల్లో నైపుణ్య అభివృద్ధి చేయడానికి కార్యక్రమాలు నిర్మించనున్నారు.

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×