E-Paper
Advertisement

2023 Scares Employees : ఉద్యోగుల్ని భయపెడుతున్న 2023

2023 Scares Employees : ఉద్యోగుల్ని భయపెడుతున్న 2023
Advertisement

2023 Scares Employees : ఆదాయాల్లో క్షీణత, ఆర్థిక మాంద్యం భయాలతో ఈ ఏడాది బడా కంపెనీల నుంచి చిన్న సంస్థల దాకా అన్నీ కోతలు పెట్టడంతో… ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. వచ్చే ఏడాది కూడా ఉద్యోగుల తొలగింపు తప్పదని చాలా కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి కూడా. ఈ పరిస్థితుల్లో జీతం పెరిగే మాట దేవుడెరుగు, ఉన్న ఉద్యోగం ఉంటే చాలని చాలా మంది ఎంప్లాయిస్ అనుకుంటున్నారు.

వచ్చే ఏడాది జీతాల పెంపు చాలా తక్కువగా ఉంటుందని, కొన్ని రంగాల్లో మాత్రం శాలరీ హైక్ బాగానే ఉంటుందని వివిధ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా భారత ఎకానమీకి వెన్నదన్నుగా నిలిచే హాస్పిటాలిటీ, ట్రావెల్, టూరిజం, కన్స్యూమర్/ఎఫ్ఎంసీజీ, పవర్ వంటి రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు… ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది జీతాల పెరుగుదల ఎక్కువగా ఉంటుందని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. టెక్‌ కంపెనీల్లో మాత్రం జీతాల పెంపు తక్కువగా ఉంటుందని వెల్లడించింది. రెసిషన్ భయంతో టెక్నాలజీ రంగం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని… మెటా, అమెజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ సహా ఇతర టెక్‌ కంపెనీల పనితీరే ఇందుకు నిదర్శనమని డెలాయిట్‌ నివేదిక హైలెట్‌ చేసింది.

Advertisement

వచ్చే ఏడాది కూడా ఐటీ రంగం ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశాలు ఎక్కుగా ఉన్నాయని డెలాయిట్ నివేదిక చెబుతోంది. ఐటీ ప్రొడక్ట్ కంపెనీల్లో 2022 ఆర్థిక సంవత్సరంలో జీతాల పెంపు 12 శాతంగా ఉండగా… 2023 ఆర్థిక సంవత్సరంలో 11.3 శాతానికే పరిమితం అవుతుందని అంచనా. ఇక ఐటీ సర్వీసెస్‌లో వేతన పెంపు 2022లో 9.4 శాతం ఉండగా… 2023లో 8.8 శాతానికే పరిమితం కానుంది. వేతనాల పెంపే కాదు… కొత్త నియామకాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇక సేవల రంగంలో జీతాల పెంపు 2022లో 8.9 శాతం కాగా… వచ్చే ఏడాది 9.4 శాతానికి చేరనుంది. పవర్‌, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లోని ఉద్యోగుల జీతాలు కూడా పెరిగే ఛాన్స్ ఉందని డెలాయిట్ నివేదిక బయటపెట్టింది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×