E-Paper
Advertisement

Stock Market: వచ్చే వారం కూడా 4 IPOల సందడి

Stock Market: వచ్చే వారం కూడా 4 IPOల సందడి
Advertisement

Stock Market: ఈ వారంలో లాగే వచ్చే వారం కూడా స్టాక్ మార్కెట్లలో 4 కంపెనీలు ఐపీఓలతో సందడి చేయబోతున్నాయి. ఆర్కియన్ కెమికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్, కైన్స్ టెక్నాలజీ ఇండియా, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీలు… ఇన్వెస్టర్ల నుంచి రూ.5,020 కోట్లు సమీకరించబోతున్నాయి.

Advertisement

ఆర్కియన్ కెమికల్స్, ఫైవ్ స్టార్ బిజినెస్ ఐపీఓలు రెండూ నవంబర్ 9 ప్రారంభమై… నవంబర్ 11న ముగుస్తాయ. నవంబర్ 21న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టవుతాయి. కైన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ ఐపీఓ నవంబర్ 10న మొదలై నవంబర్ 14న ముగుస్తుంది. ఇక ఐనాక్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ ఇష్యూ నవంబర్ 11న ప్రారంభమై… నవంబర్ 15న ముగుస్తుంది.

ఆర్కియన్ కెమికల్స్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,462 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.386-రూ.407గా నిర్ణయించారు. ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,960 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేరు ధరను రూ.450-రూ.474గా నిర్ణయించారు. ఇక కైన్స్ టెక్నాలజీ ప్రైస్ బ్యాండ్ ను షేరుకు రూ.559-రూ.587గా నిర్ణయించారు. రుణభారాన్ని తగ్గించుకోవడంతో పాటు… వ్యాపార విస్తరణకు ఈ నిధుల్ని వినియోగించనుంది… కైన్స్ టెక్నాలజీ. ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ షేర్ల విక్రయం ద్వారా రూ.740 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ.370 కోట్లను ఐపీఓ ద్వారా, మరో రూ.370 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఇన్వెస్టర్ల నుంచి తీసుకుంటారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×