Ranveer Singh: ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ (Ranveer Singh)ప్రస్తుతం వివాదంలో చుక్కుకున్న సంగతి తెలిసిందే. ఈయన ఇటీవల గోవాలో జరిగిన IFFI 2025 అవార్డు (IFFI 2025)వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రణవీర్ సింగ్ కాంతారా సినిమా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈయన కాంతారా సినిమా చాలా అద్భుతంగా ఉందని, రిషబ్ నటన గురించి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. ఇంతటితో ఆగకుండా కాంతారా సినిమాలో పంజుర్లి దేవుడు ఆవహించినప్పుడు చేసే ఓ… అనే శబ్దాన్ని రణవీర్ సింగ్ ఈ అవార్డు వేడుకలలో భాగంగా ఇమిటేట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదాలకు కారణమైంది. కన్నడ సంస్కృతి సాంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .కన్నడ నాట ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే పంజుర్లి దేవుడిని రణవీర్ సింగ్ అపహస్యం చేస్తూ మాట్లాడారని వెంటనే ఈయన క్షమాపణలు చెప్పాలి అంటూ కన్నడ ప్రేక్షకులు పెద్ద ఎత్తున డిమాండ్లు వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై రణవీర్ సింగ్ ఎక్కడ స్పందించలేదు అలాగే నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి కూడా ఈ వివాదంపై స్పందించలేదు.
ఈ క్రమంలోనే రణవీర్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల హిందూ జన జాగృతి సమితి(Hindu Janajagruti Samiti ) పోలీసులకు ఫిర్యాదు చేశారు . రణవీర్ సింగ్ చాముండి దైవం ఆవహించిన సన్నివేశాలను అనుకరిస్తూ దానిని ఫిమేల్ గోస్ట్ గా అభివర్ణించిన విధానం కచ్చితంగా హిందువులు, ముఖ్యంగా తులునాడు సాంప్రదాయాన్ని అపహాస్యం చేయడమనని హిందూ జన జాగృతి ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. రణవీర్ సింగ్ వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్లు వ్యక్తం చేస్తూ రణవీర్ సింగ్ పై పనాజీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఇలా ఈ ఘటన పట్ల రణవీర్ సింగ్ స్పందించని నేపథ్యంలో ఈ విషయంపై వివాదం కొనసాగుతూనే ఉంది.
విడుదలకు సిద్ధమైన ధురంధర్..
ఇప్పటికైనా రణవీర్ సింగ్ ఈ ఘటనపై స్పందించి క్షమాపణలు చెబుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి తరుణంలోనే ఈయన ఈ వివాదంలో నిలిచిన నేపథ్యంలో సినిమాపై కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్స్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 1970-80ల నాటి గూఢచర్య నాటకం ఆధారంగా ఒక కల్పిత స్పై థ్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇందులో సారా అర్జున్,రణవీర్ సింగ్, మధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా వంటి తదితరులు నటించారు.
Also Read: Kalki 2: కల్కి2లో గ్లోబల్ బ్యూటీ.. వారణాసి క్రేజ్ బాగానే వాడుతున్నారే?