E-Paper
Advertisement

Sharib Hashmi: భార్యకు క్యాన్సర్ వచ్చినా, అన్నీ తానై.. జేకే రియల్ లైఫ్ ఇదే.. చదివితే కన్నీళ్లు ఖాయం!

Sharib Hashmi: భార్యకు క్యాన్సర్ వచ్చినా, అన్నీ తానై.. జేకే రియల్ లైఫ్ ఇదే.. చదివితే కన్నీళ్లు ఖాయం!

భార్య భర్తల బంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నచ్చినప్పుడు ఎంజాయ్ చేసి, కష్టం కలగగానే విడిపోయే ఈ తరం యువతీ యువకులకు బహుశా ఆ బంధం విలువ తెలియకపోవచ్చు. కష్టాలు, కన్నీళ్లు, సుఖాలు, దుఃఖాల్లో కలిసి ఒక్కటిగా కలిసి ముందుకు నడవాలి. అదే నిజమైన వివాహ బంధం అనిపించుకుంటుంది. ఇందుకు  బెస్ట్ ఎగ్జాంపుల్ నటుడు, దర్శకుడు షరీబ్ హష్మి. క్యాన్సర్ బాధితురాలు అయిన తన భార్య నస్రీన్ ను ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. నాలుగుసార్లు క్యాన్సర్ ఆపరేషన్లు అయినా, తన అందం అంతా కోల్పోయినా, ఆమెకు కొండంత ధైర్యమై నిలబడ్డాడు. ప్రాణాంతక క్యాన్సర్ నుంచి కోలుకునే వరకు తన చేయిపట్టుకుని ముందుకు నడిపించారు. భర్త అంటే ఇలా ఉండాలనేలా ప్రతి ఒక్కరి హృదయంలో స్థానం సంపాదించారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

షరీబ్ హష్మి..  నస్రీన్ తో 2003 డిసెంబర్ 27న పెళ్లి జరిగింది. వారికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. షరీబ్ తన కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలోనే నస్రీన్‌(2018)కు ఓరల్ క్యాన్సర్ వచ్చింది. అప్పుడప్పుడే గాడిలో పడుతున్న ఆయన కుటుంబానికి ఈ పరిణామం మరింత కుంగదీసింది. మళ్లీ సమస్యల వలయంలోకి వెళ్లిపోయింది. కానీ, నస్రీన్ పోరాటం, , షరీబ్ ధైర్యం క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొనేలా చేశాయి. ఏకంగా ఆమెకు నాలుగుసార్లు క్యాన్సర్ ఆపరేషన్ జరిగింది. ప్రతీ సర్జరీ తర్వాత కేవలం వారం రోజుల్లోనే తిరిగి జాబ్ కు వెళ్లేది. కుటుంబానికి అండగా ఉండాలని ఎప్పుడూ తపనపడేది.  క్యాన్సర్ కారణంగా ఆమె శరీరం, ముఖ ఆకృతి పూర్తిగా మారిపోయింది. కానీ, ఆమె ఏమాత్రం కుంగిపోలేదు. తనకు ఎదురైన ప్రతి సవాల్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. ఆమెను భర్త వెనుకుండి నడిపించాడు. 2022 ఏప్రిల్ నుంచి నస్రీన్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకుంది. ఆమె ఓ క్యాన్సర్ వారియర్ గా నిలిచింది.

కెరీర్ ప్రారంభంలో ఎన్నో సమస్యలు

షరీబ్ తన కెరీర్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. 2009లో ఉద్యోగం వదులుకుని సినిమాల్లోకి వచ్చాడు. నస్రీన్ తమ కుమారుడు జన్మించిన తర్వాత ఉద్యోగాన్ని వదులుకుని కుటుంబాన్ని చూసుకుంది. సరైన ఆదాయం లేక చాలా ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో ఆమెను క్యాన్సర్ రావడంతో ఇల్లు, నగలు అమ్మి ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేశారు. నాలుగు సర్జరీల తర్వాత తను కోలుకుంది. 2022లో షరీబ్ ఇండియన్ క్యాన్సర్ సొసైటీ కోసం సర్వీస్ అడ్‌ లో నటించాడు. తన భార్య కోసం ఈ యాడ్ లో ఉచితంగా నటించాడు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ ఆయన సీనీ కెరీర్ ను కీలక మలుపు తిప్పింది. ఈ వెబ్ సిరీస్ లో జెకె తల్పడే పాత్ర అయనకు తిరుగులేని గుర్తింపు తీసుకొచ్చింది. సినీరంగంలో నిలదొక్కుకునేలా చేసింది.

షరీబ్ హష్మి గురించి..

షరీబ్ హష్మి ప్రస్తుతం నటుడు, రచిత, నిర్మాత, దర్శకుడిగా కొనసాగుతున్నాడు. హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌ లలో నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపడుతున్నాడు. షరీబ్ తన కెరీర్‌ను 2008లో వచ్చిన ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’తో ప్రారంభించాడు. కానీ, 2019లో అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’లో జెకె తల్పడే పాత్రతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ పాత్రకు  ఫిల్మ్‌ ఫేర్ OTT అవార్డుతో పాటు పలు అవార్డు దక్కాయి. ఈ సిరీస్‌లో అతని కామెడీ, ఎమోషనల్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘అసుర్’ థ్రిల్లర్ సిరీస్, ‘మిషన్ మజ్ను’, ‘ఫిరోజ్‌ పూర్ రోడ్, ‘అల్ క్వబూల్’ లాంటి సినిమాలకు పని చేశాడు. రచయితగా కూడా పని చేశాడు. స్వంతంగా షార్ట్ ఫిల్మ్‌ లను నిర్మించాడు. చక్కటి గాయకుడు కూడా. తను తెలుగు పాటలు పాడి, సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. తన కుటుంబంతో ముంబైలో నివసిస్తున్న ఆయన, సోషల్ మీడియాలో చురుకుగా ఉంటాడు. ప్రస్తుతం సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు.

Read Also: ప్రపంచమంతా అంతమైనా.. ‘వారణాసి’ మాత్రం చెక్కు చెదరదు, శివయ్యే స్వయంగా…

Related News

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

Big Stories

×