E-Paper
Advertisement

Air Pollution :టెక్నాలజీతో ఇంట్లోని గాలి కాలుష్యానికి చెక్..!

Air Pollution :టెక్నాలజీతో ఇంట్లోని గాలి కాలుష్యానికి చెక్..!
Advertisement
Air Pollution

Air Pollution : గాలి కాలుష్యం అనేది కేవలం బయట మాత్రమే కాదు.. ఇంట్లో కూడా ఉంటుందని ఇప్పటికే పరిశోధకులు హెచ్చరించారు. గ్యాస్ స్టవ్ ద్వారా కాలుష్యం ఏర్పడుతుందని, దాని వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని వారు ఇప్పటికే బయటపెట్టారు. అయితే ఈ విభాగంలోనే వారు మరిన్ని పరిశోధనలు చేసి ప్రజలకు అవగాహన ఇవ్వాలని అనుకున్నారు. ప్రస్తుతం ఆ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.

నైట్రోజెన్ ఆక్సైడ్, కార్బన్ మోనోక్సైడ్, హైడ్రో కార్బన్స్, మిథేన్ వంటి గ్యాస్‌లు ఆరోగ్యానికి కీడు చేస్తాయి. పరిమితి మించిన గ్యాస్‌లు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఇంటి నుండి గ్యాస్‌ను బయటికి పంపించేయడానికి చాలావరకు ఇళ్లల్లో హై క్వాలిటీ ఫర్నేసస్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ దాని వల్ల కూడా కాలుష్యం ఏర్పడుతుందని పరిశోధనల్లో తేలింది. వీటి వల్లే కోరోసివ్ యాసిడ్ అనేది తయారవుతుందని వారు కనుగొన్నారు. అంతే కాకుండా హానికరమైన గ్యాస్‌లను గాలిలోకి వదులుతున్నాయన్నారు.

Advertisement

అయితే ఈ ఫర్నాస్‌లు గాలిలోకి హానికరమైన గ్యాస్‌లను వదలకుండా శాస్త్రవేత్తలు ఒక టెక్నాలజీని తయారు చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా దాదాపు 99.9% గ్యాస్‌లు గాలిలో కలవకుండా ఆపవచ్చని వారు అంటున్నారు. వాటర్ హీటర్లు, బాయిలర్స్, పరిశ్రమల ఫర్నాస్‌లకు కూడా ఈ యాసిడిక్ గ్యాస్ రిడక్షన్ (ఏజీఆర్) టెక్నాలజీని ఉపయోగింవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏజీఆర్ టెక్నాలజీ ద్వారా గ్రీన్ హౌస్ గ్యాస్‌లను గాలిలో కలవకుండా ఆపవచ్చని వారు చెప్తున్నారు.

ఏజీఆర్ టెక్నాలజీని పరీక్షించానికి శాస్త్రవేత్తలు దీనిని ఒక ఇంటి ఫర్నాస్‌లో చేర్చారు. 400 గంటలు గమనించారు. ఆ తర్వాత దాదాపు కాలుష్యాన్ని సృష్టించే ఏ గ్యాస్ కూడా బయటికి రాలేదని వారు గుర్తించారు. అంతే కాకుండా పీహెచ్ లెవల్ కూడా మామూలుగానే ఉందని వారు తెలిపారు. న్యూట్రాన్ కంప్యూటెడ్ టెక్నాలజీతో ఈ పరిశోధనలు సక్సెస్ అయ్యాయని వారు అన్నారు. దీంతో పాటు గ్యాస్‌కు సంబంధించిన మరెన్నో పరిశోధనలు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×