BigTV English

Shivratri Special : ఈసారి శివరాత్రికి మరో ప్రత్యేకత

Shivratri Special : ఈసారి శివరాత్రికి మరో ప్రత్యేకత

Shivratri Special : ఈసారి మహాశివరాత్రితోపాటు, శనిత్రయోదశి ఒకే రోజు వస్తున్నాయి. దాదాపు 114 ఏళ్ల తర్వాత శివరాత్రి, శని త్రయోదశి ఒకే రోజు వచ్చాయి. శనివారం తోపాటు త్రయోదశి కలిసిన రోజు శని త్రయోదశి. ఈతిథిని శనికి పవిత్రమైనదిగా భావిస్తారు. శనిత్రయోదశి రోజు ఏ కోరికలు , కష్టనష్టాలు ఉన్నా.. సంకల్పం చేసుకుంటే.. కచ్ఛితంగా నేరవేరతాయి. ఇవాళ శివుడు కన్నా ముందే శనీశ్వరుడ్ని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పురాణాల ప్రకారం శని కరుణిస్తే అసలు కష్టాలు ఉండవట. శనికి కోపం వాస్తే ఈశ్వరుడి కైనా సరే శని దోషం తప్పదని.శని యముడికి సోదరుడు, జ్యేష్టాదేవికి భర్త, శివుడికి పరమ భక్తుడు. అతని భక్తిని శివుడు పరీక్షించాలనుకున్నాడు. నేనంటే నీకు ప్రీతి కదా, నేను ఏ రూపంలో ఉన్న సరే నన్ను గుర్తుపట్టగలవా అని పరమశివుడు శనికి ఒక షరతును విధిస్తాడు. శనిని పరీక్షించేందుకు శివుడు సూర్యోదయం సమయంలో బిల్వ వృక్షంగా మారుతాడు.


సాయంత్రానికి మళ్లీ మామూలు రూపంలో ప్రత్యక్షమవుతాడు. బిల్వ వృక్షం నుంచి అసలు రూపంలోకి వచ్చిన శివుడికి శని కనిపిస్తాడు.శనీశ్వర నన్ను పట్టుకోలేకపోయావుగా అని ఈశ్వరుడు చెప్పినప్పుడు అదేంటి స్వామి నేను పట్టుకోవడం వల్లే కదా మీరు బిల్వ వృక్షం రూపం దాల్చాల్సి వచ్చింది అని జవాబిస్తాడు. అలా ఈశ్వరుడు శని భక్తిని మెచ్చుకున్నాడు. బిల్వ దళాలతో శనీశ్వరుని పూజిస్తే శుభాలను అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే బిల్వ దళాలతో శనీశ్వరుడిని పూజిస్తారు.

శివ‌రాత్రి రోజున ల‌క్ష బిల్వార్చ‌న చేసి, భ‌క్తితో పూజించి, అభిషేకిస్తే శివానుగ్ర‌హానికి పాత్రుల‌వుతారు. పంచాక్ష‌రీ మంత్ర జ‌పంతో పునీతుల‌వుతారు. పూజా విధానం, మంత్రాలు తెలియ‌క‌పోయినా ఉప‌వాసం, జాగ‌ర‌ణ‌, బిల్వార్చ‌న‌, అభిషేకం వంటి పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటే శివానుగ్ర‌హం ల‌భిస్తుంద‌ని వేద పండితులు చెబుతున్నారు.


Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×