Deepika Padukone in AA22xA6: బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్లో హీరోలకు సమామైన గుర్తింపు. డ్యాన్స్, యాక్షన్‌లో హీరోలకు పోటీపోటీగా గట్టి పోటీ ఇస్తుంది. కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. ఎంతోమంది హీరోయిన్లు వచ్చారు. కానీ, ఇప్పటి వరకు హిందీలో ఆమెను రీప్లేస్ చేసిన వారే లేరు. దశాబ్ధాలుగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ.. తనకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సంపాదించుకుంది. హిందీలో మగుటం లేని మహారాణిలా రాణించిన ఆమె.. తెలుగులోనూ రాణించాలని చూసింది.
అందుకే ఇక్కడ భారీ చిత్రంతో కెరీర్‌ని ప్లాన్ చేసుకుంది. అప్పుడే కల్కి 2898 ఏడీ ఆఫర్ రావడంతో ఒకే చెప్పి టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకోవాలన్న దీపికాకు ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. రెండో సినిమాకే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. స్పిరిట్, కల్కి 2 నుంచి ఆమె తొలగించడంతో ప్రస్తుతం తెలుగులో దీపికా కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి కల్కి 2898 ఏడీలో దీపికా తనదైన నటనతో తెలుగు ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ఇందులో అమ్మ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. కీలక సన్నివేశాల్లో ఆమె పలకించిన హావభావాలు, ఎమోషన్స్ ఆడియన్స్‌ని హత్తుకున్నాయి. తెలుగు ఆడియన్స్ దీపికాను ఆప్ట్ చేసుకుంటారా? అని ప్రశ్నించిన వారికి తనదైన నటనతో సమాధానం ఇచ్చింది. దీంతో తెలుగులో ఆమెకు తిరుగులేదని అనుకున్నారు అంతా. ఇక దీపికా సైతం తన క్రేజ్ ఇక్కడ ఇక్కడ మంచిమార్కెట్ చేసుకోవాలని చూసింది.
కానీ, అదే ఆమెను భారీగా దెబ్బ తిసిందనిపిస్తోంది. టాలీవుడ్ బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి సైన్ చేసి కెరీర్ పరంగా దూసుకుపోవాలని చూసింది. కానీ, వాటికి స్పిరిట్‌తో బ్రేక్ పడింది. కల్కిలో దీపికా నటనకు ఫిదా అయిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్‌తో తను చేసే స్పిరిట్ మూవీకి ఆమెనే హీరోయిన్ అనుకున్నారు. అదే ఆమె కలిసి చెప్పారు. స్పిరిట్ కథ కూడా వినిపంచాడు. కానీ, దీనికి ఆమె పెట్టిన కండిషన్స్ చూసి దర్శక–నిర్మాతలు కంగుతిన్నారు. హీరోకి సమామైన రెమ్యునరేషన్ లేదా వచ్చిన లాభాల్లో షేర్స్ అడిగిందట. ఇక వర్కింగ్ అవర్స్‌లోనూ లిమిట్స్ పెట్టింది. వారానికి 8 నుంచి 12 గంటలు మాత్రమే పని చేస్తానంటూ నిబంధలు పెట్టడంతో.. స్పిరిటీ టీం ఆమెకు దండం పెట్టింది. దీపికాను వద్దని.. యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రిని తీసుకున్నాడు సందీప్ రెడ్డి వంగా.
Also Read: Deepika Padukone: శభాష్ తెలుగు ప్రొడ్యూసర్స్.. దీపికా ఇష్యూపై నెటిజన్స్ మాటలు ఇవి
ఈ విషయం బయటకు రావడంతో దీపికాకు నెగిటివిటీ పెరిగింది. తాజాగా కల్కి 2 నుంచి ఆమెను తొలగించడంతో.. నెగిటివిటీ మరింత ఎక్కువైంది. మూవీలో కీలక పాత్ర పోషించిన నటీనటులను వదులకునేందుకు మూవీ టీం ఎంతో ధైర్యం చేయాలని. ఎంతో పెద్ద కారణం ఉంటే కానీ, తొలగించారు. అలాంటి కఠినం నిర్ణయం కల్కి మూవీ టీం తీసుకుందంటే.. దీపికా ఏ స్థాయిలో వారిని ఇబ్బంది పెట్టి ఉంటుందో అర్థమైపోతుంది. ఆమెను తీసేయడానికి ఖచ్చితమైన కారణం మాత్రం మూవీ టీం వెల్లడించలేదు. కానీ, దీపికా తొలగించడం వెనక బలమైన కారణమే ఉంటుంది తెలుగు ఆడియన్స్ అంత నమ్ముతున్నారు. దీంతో తెలుగులో తన మార్కెట్ పెంచుకోవాలనుకున్న దీపికా.. మాత్రం ఇది పెద్ద షాక్. తెలుగులో ఆమె కెరీర్‌కి భారీ డ్యామేజ్ జరిగిందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం టాలీవుడ్లో ఆమెకు ఒకే ఒక్క సపోర్టు ఉంది. అది అల్లు అర్జున్-అట్లీ మూవీ. ఈ సినిమా ఆమె డ్యామేజ్ తిరిగి నిలబెడుతున్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే హీరో తెలుగు వాడే అయినా.. డైరెక్టర్, నిర్మాత తమిళ్ ఇండస్ట్రీకి చెందిన వారు. కాబట్టి.. ఇక తెలుగులో దీపికా పని అయిపోయినట్టే అంటున్నారు సినీ క్రిటిక్స్, విశ్లేషకులు.