BigTV English

Deepika Padukone : తీసేస్తే తీశారు కానీ… కెరీర్‌‌పై గట్టి దెబ్బ కొట్టారు

Deepika Padukone : తీసేస్తే తీశారు కానీ… కెరీర్‌‌పై గట్టి దెబ్బ కొట్టారు

Deepika Padukone Kalki 2 : ఇటు టాలీవుడ్‌లో… అటు బాలీవుడ్‌లో.. ఇప్పుడు ఒక్కటే హాట్ టాపిక్. అదే కల్కి 2 మూవీ నుంచి దీపికా పదుకోణెను తప్పించడం. ఇప్పటికే ఈమెను స్పిరిట్ మూవీ నుంచి తొలగించారు. అది మర్చిపోక ముందే ఇప్పుడు కల్కి 2 నుంచి కూడా అవుట్. అయినా పర్లేదు. దీపికా పదుకోణెకు ఉన్న క్రేజ్ ముందు ఆమెకు ఉన్న రేంజ్ ముందు ఒక రెండు సినిమాలు పోయినంత మాత్రానా… ఏం అయిపోలేదు.


కానీ, అప్పుడు స్పిరిట్ టైంలో, ఇప్పుడు కల్కి 2 టైంలో నిర్మాతలు ఆమె పరువు తీశారు. ఆమె కెరీర్‌పై గట్టి దెబ్బ కొట్టారు. ఆ ఇద్దరు ఇచ్చిన ఓపెన్ స్టేట్మెంట్స్ దీపికా పదుకోణె తర్వాత సినిమా ఛాన్స్‌లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

స్టోరీ లీక్ చేసింది – డర్టీ పీఆర్ గేమ్స్

మొన్నటికి మొన్న స్పిరిట్ మూవీ నుంచి దీపికా పదుకోణెను తొలగించే టైంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీపికను ఉద్దేశిస్తూ… “డర్టీ పీఆర్ గేమ్స్” అని కామెంట్ చేశాడు. అంతే కాదు… నమ్మకంగా స్టోరీ చెబితే… అది లీక్ చేసింది అంటూ అరోపించాడు. అలాగే, మొత్తం స్టోరీ లీక్ చేసిన తనపై ఎలాంటి ప్రభావం చూపదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.


ఆ టైంలో దీపికా పదుకోణెకు ఘోర అవమానమే జరిగింది అని చెప్పొచ్చు. ఓ మూవీ నుంచి తీసేయడమే కాకుండా, ఇలాంటి అరోపణలు చేయడం చాలా ఎఫెక్ట్ చూపించింది. అది మర్చిపోక ముందే ఇప్పుడు కల్కి 2 వివాదం స్టార్ట్ అయింది.

కల్కి 2 చేసే అర్హత లేదు

ఈ కల్కి 2 వివాదంలో కూడా దీపికకు అవమానం జరిగింది. అది కూడా తన కెరీర్‌పై ఎఫెక్ట్ పడేలా ఉంది. ఈ రోజు కల్కి 2 నిర్మాతలు దీపికాను తప్పిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే… కల్కి 2 లాంటి సినిమా చేసే అర్హత లేదు అని, ఆమెకు కమిట్మెంట్ లేదు అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక హీరోయిన్ నిజానికి రావొద్దు. కానీ, వరుసగా రెండు సార్లు దీపికా పదుకోణె వీటిని ఎదుర్కొంది.

తప్పుంతా దీపికాదే ?

అయితే, మొత్తం ఈ రెండు సినిమాల వివాదంలో చాలా మంది దీపికా పదుకోణె వైపే వేలు పెట్టి చూపిస్తున్నారు. దీపిక చేసే డిమాండ్స్ వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని చెబుతున్నారు. సినిమా చేసే టైంలో ఆ సినిమాకు కావాల్సినంత టైం ఇవ్వాలని అంటున్నారు. కానీ దీపిక మాత్రం రోజుకు 8 గంటలు… ఆదివారాలు సెలవు… భారీ రెమ్యునరేషన్స్… ప్రాఫిట్ లో షేర్ అంటూ ఇంకా చాలా డిమాండ్స్ చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి.

బాలీవుడ్ నుంచి మాత్రమే సపోర్ట్

అప్పుడు స్పిరిట్ వివాదంలో టైంలో… సందీప్ రెడ్డి వంగా తప్పు పట్టిన వాళ్లు పెద్దగా కనిపించలేదు. దీపిక వైపు ఒకరో ఇద్దరో నిలబడినా… అది పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పుడు కల్కి 2 నుంచి తొలగించినా… దీపికకు ఇప్పటి వరకు అయితే ఎవరూ సపొర్ట్ చేయలేదు. ఒక వేళ నెక్ట్స్ చేసే వాళ్లు ఉన్నా… అది బాలీవుడ్ నుంచి మాత్రమే రావొచ్చు అని క్రిటిక్స్ అంటున్నారు. అది కూడా ఒకరో.. ఇద్దరో మాత్రమే రెస్పాన్డ్ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

Related News

Deepika Padukone: అయ్యో దీపికా.. టాలీవుడ్‌లో ఒకే ఒక్కడు సపోర్ట్… అయినా డ్యామేజ్ జరిగిపోయింది

Deepika Padukone: శభాష్ తెలుగు ప్రొడ్యూసర్స్.. దీపికా ఇష్యూపై నెటిజన్స్ మాటలు ఇవి

OG Trailer: సర్‌ప్రైజ్‌.. ‘ఓజీ’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. ఎప్పుడంటే!

Deepika Padukone: కల్కి2 నుంచి దీపికా అవుట్.. సందీప్ రెడ్డి రియాక్షన్ చూసారా?

Deepika Padukone: ‘కల్కి 2’ నుంచి దీపికా అవుట్‌.. ఆమెను రీప్లేస్‌ చేసేది ఎవరంటే?

Sudigali Sudheer: పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో.. ప్రియాంక, శివ్ ల పరువు తీసిన సుధీర్

Pawan Kalyan: పవన్‌పై పడి ఏడ్చేవాళ్లంతా.. మళ్లీ ఆయన సినిమాలోనే కనిపిస్తారా?

Big Stories

×