BigTV English

IRCTC – Aadhaar: వెంటనే ఇలా చేయండి.. లేకపోతే అక్టోబర్ 1 నుంచి టికెట్ల బుకింగ్ కష్టమే!

IRCTC – Aadhaar: వెంటనే ఇలా చేయండి.. లేకపోతే అక్టోబర్ 1 నుంచి టికెట్ల బుకింగ్ కష్టమే!

IRCTC Aadhaar Update: 

ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా భారతీయ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా రిజర్వేషన్ సిస్టమ్ ప్రయోజనాలు సాధారణ వినియోగదారులకు చేరేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మోసపూరిత కార్యకలాపాలను నివారించడానికి కఠిన చర్యలు అవలంభిస్తోంది. ఇందులో భాగంగానే రిజర్వ్డ్ జనరల్ టికెట్లకు కూడా ఆధార్ ప్రమాణీకరణను తప్పనిసరి చేసింది. ఇప్పటి వరకు తత్కాల్ టికెట్లకు మాత్రమే పరిమితమైన ఈ నిబంధన, ఇప్పుడు జనరల్ టికెట్లకు కూడా అమలు చేస్తోంది. ఆధార్ తో లింక్ చేసిన వినియోగదారులు జనరల్ రిజర్వేషన్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాలలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌ సైట్ లేదంటే యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఆధార్ లింక్ చేసుకోని వాళ్లు ఈ 15 నిమిషాల్లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం లేదు.


అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన అమలు

భారతీయ రైల్వే తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఇండియన్ రైల్వేస్ కంప్యూటరైజ్డ్ PRS కౌంటర్లలో జనరల్ రిజర్వ్డ్ టికెట్లను కొనుగోలు చేసే షెడ్యూల్స్ లో ఎలాంటి మార్పులు ఉండబోవని అధికారులు తెలిపారు. ప్రస్తుత 10 నిమిషాల పరిమితిలో కూడా ఎటువంటి మార్పు లేదు. బుకింగ్ విండో ఓపెన్ అయిన తొలి 10 నిమిషాల్లో భారతీయ రైల్వే అధీకృత టికెటింగ్ ఏజెంట్లు రిజర్వ్డ్ టికెట్లను బుక్ చేయడానికి అనుమతించబడరు. CRIS & IRCTC అన్ని జోనల్ రైల్వేలకు సమాచారం అందిస్తూ టికెట్ బుకింగ్ వ్యవస్థలో అవసరమైన మార్పులు చేయాలంటూ రైల్వేశాఖ సర్క్యులర్ జారీ చేసింది. తాజా మార్పుల గురించి ప్రయాణీకులకు తెలియజేసేందుకు అన్ని పద్దతుల్లో ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

Read Also: ఇండియాలోనే అతి చిన్న ప్లాట్‌ఫాం కలిగిన రైల్వే స్టేషన్ ఇదే.. అంత చిన్నదా?


IRCTC ఖాతాతో ఆధార్ తో ఎలా లింక్ చేయాలి?

⦿ మీకు ఇష్టమైన వెబ్ బ్రౌజర్‌ను తెరిచి, మీ వివరాలతో IRCTC వెబ్‌సైట్‌లోకి లాగిన్కావాలి.

⦿ తరువాత, ఎగువన ఉన్న మై అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. వినియోగదారుని ప్రామాణీకరించు అనే బటన్ మీద ప్రెస్ చేయాలి.

⦿ కింద స్క్రీన్‌ లో  మీ ఆధార్ లేదంటే వర్చువల్ IDని ఎంటర్ చేయాలి.

⦿ కొనసాగే ముందు, పేరు, పుట్టిన తేదీ, లింగం సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి

⦿ అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ నొక్కాలి. మీ ఫోన్‌ లో వన్ టైమ్ పాస్‌ వర్డ్‌ ను పొందడానికి ఓటీపీ కోసం రిక్వెస్ట్ చేయండి.

⦿ OTP ని నమోదు చేసి, బాక్స్‌ లో టిక్ చేయాలి. గిన్ విధానాన్ని పూర్తి చేయడానికి సబ్మిట్ బటన్‌ నొక్కాలి.

⦿ మీ ఆధార్ కార్డును IRCTC ఖాతాకు లింక్ చేయడం పూర్తయిన తర్వాత, తిరిగి లాగిన్ అవ్వండి. అంతే, ఆధార్ లింక్ అయిపోతుంది. హ్యాపీగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Read Also: ఐఆర్‌సీటీసీలో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ స్టార్ట్ అయ్యేది ఈ టైమ్‌లోనే.. ఇది గుర్తుపెట్టుకోండి!

Related News

TIRUN Cruise: ఫ్యామిలీ ట్రిప్‌కి బంపర్ ఆఫర్.. 60శాతం డిస్కౌంట్, పిల్లలకు ఉచితం

Smallest Railway Station: ఇండియాలోనే అతి చిన్న ప్లాట్‌ఫాం కలిగిన రైల్వే స్టేషన్ ఇదే.. అంత చిన్నదా?

Viral Video: వేగంగా వస్తున్న.. వందే భారత్ ముందుకు దూకిన కుక్క.. తర్వాత జరిగింది ఇదే!

Vande Bharat train: పూరికి నేరుగా వందే భారత్ రైలు.. ఎక్కడి నుంచి అంటే?

Train Ticket Booking: ఐఆర్‌సీటీసీలో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ స్టార్ట్ అయ్యేది ఈ టైమ్‌లోనే.. ఇది గుర్తుపెట్టుకోండి!

Canadian Influencer: ఇండియన్ రైల్ ఎక్కిన కెనడా అమ్మాయి.. రైల్వే గురించి ఆమె చెప్పింది వింటే ఫ్యూజులు అవుట్!

Meal Delivery: జొమాటోతో మేక్ మై ట్రిప్ జోడీ, ఇక రైల్వే ప్రయాణీకులకు నేరుగా ఫుడ్ డెలివరీ!

Big Stories

×