OG Trailer Update: ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ అవైయిట్ చిత్రాల్లో ‘ఓజీ’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన బర్త్డే గ్లింప్స్తో మూవీపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఇక టీజర్తో అవి రెట్టింపు అయ్యాయి. మూవీ రిలీజ్కి ఇంకా వారం రోజులే ఉంది. మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసిన టీం మూవీ తాజాగా క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ఓజీ మూవీ ట్రైలర్ (OG Movie Trailer) అప్‌డేట్ ఇచ్చింది.
ట్రైలర్ రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్ వదిలింది. ఇది ఫ్యాన్స్ అంత పండగ చేసుకుంటున్నారు. కాగా సెప్టెంబర్ 25న ఓజీ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ రిలీజ్ కి నాలుగు రోజుల ముందే మూవీ టీం ట్రైలర్ లాంచ్‌ని గ్రాండ్ని ప్లాన్ చేసింది. సెప్టెంబర్ 21న మూవీ ట్రైలర్ని రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ అప్‌డేట్ చూసి అభిమానులంత ఫుల్ ఖుష్ అవుతున్నారు. జస్ట్ బర్త్ డే గ్లింప్స్, టీజర్ సుజిత్ ఓజీపై విపరీతమైన బజ్ పెంచాడు. ఇక ట్రైలర్ ఏ రేంజ్ ప్లాన్ చేసి ఉంటాడా? ఫ్యాన్స్ అంతా అంచనాల్లో మునిగితేలుతున్నారు.
ముందు నుంచి ఓజీపై అంచనాలు భారీగా ఉన్నాయి. సుజిత్ దర్శకత్వంలో పవన్ సినిమా అనగానే.. ఫ్యాన్స్ అంత ఊహాల్లో తెలిపోయారు. పవర్ స్టార్ గ్యాంగ్‌స్టర్‌గా చూపించబోతున్నాడంటే.. పవర్ స్టార్ కోసం దమ్మున్న కంటెంట్ సిద్ధం చేశాడని అభిమానులంత సుజిత్పై గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ఇక ఓజీ నుంచి వచ్చిన పోస్టర్స్ కూడా అవి నిజమే అని ప్రూవ్ చేసి. ఇందులో పవన్ లుక్ పోస్టర్స్ అంచనాలు రెట్టింపు చేశాయి. గ్లింప్స్, టీజర్ రెట్టింపు హైప్ క్రియేట్ చేశాయి. హరి హర వీరమల్లు ఫలితంగా డిసప్పాయింట్లో ఉన్న ఫ్యాన్స్ ఓజీతో మంచి ట్రీట్ అందుతుందని అంత నమ్ముతున్నారు. ఇందులో పవన్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Also Read: Deepika Padukone: ‘కల్కి 2′ నుంచి దీపికా అవుట్.. ఆమెను రీప్లేస్ చేసేది ఎవరంటే?
ఇక ఇందులో విలన్ లుక్ అయితే ఫ్యాన్స్ని సైతం ఫిదా చేస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతికథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇందులో అతడు ఓమీ అనే విలన్ గ్యాంగ్‌స్టర్ పాత్ర పోషిస్తున్నాడు. ఓజీలో హీరో వర్సెస్ విలన్ అనే విధంగా మూవీ కొనసాగుతుందని ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్, టీజర్ చూస్తే అర్థమైపోతుంది. ఈ సినిమాలో హీరో, విలన్ పాత్రలను తీర్చిదిద్దిన తీరు.. సరికొత్తగా ఉందంటూ సుజిత్పై ప్రశంలు కురిపిస్తున్నారు. మొత్తానికి సెప్టెంబర్ 25న ప్రేక్షకులకు సుజిత్ ట్రీట్ ఫిస్ట్ ఇవ్వబోతున్నాడని మురిసిపోతున్నారు. ఇందులో పవన్ సరసన ప్రియాంక్ మోహన్ ఆరుళ్ నటిస్తోంది. ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తమన్ సంగీతం అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు.
Death quota….confirm anta!! 🤙🏻🤙🏻
The most awaited #OGTrailer on Sep 21st.#OG #TheyCallHimOG pic.twitter.com/lmAo1CkdAU
— DVV Entertainment (@DVVMovies) September 18, 2025