Deepika Padukone Out From Kalki 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ‘ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగ్ అశ్వి న్ తన విజయ్తో వెండితెరపై అద్బుతం చేశాడు. కల్కి కోసం ఏకంగా మూడు లోకాలు సృష్టించి ఆడియన్స్ని అబ్బురపరిచాడు. ఇందులో నాగ్ అశ్వి న్ పనితనానికి దర్శక దిగ్గజాలు సైతం ఫిదా అయ్యారు. అందరూ ఊహించినట్టుగానే కల్కి మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడమే కాదు.. వెయ్యి కోట్లపైగా వసూళ్లు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్గా కల్కి 2 రాబోతోంది. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సీక్వెల్ సెట్స్‌పైకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కి కల్కి టీం షాకింగ్ అప్డేట్ ఇచ్చింది.
ఈ చిత్రం నుంచి దీపికా పదుకొనెను తొలగిస్తున్నట్టు ఆఫిషియల్ అనౌన్స్మెంట్ చేసింది. కల్కి పార్ట్ 1లో దీపికా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్కు పరిచయమైంది. ఇందులో ఆమె పర్ఫామెన్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆ తర్వాత వచ్చిన తెలుగు పాన్ ఇండియా సినిమాల్లోనూ దీపికా పేరును పరిశీలించారు. అల్లు అర్జున్- అట్లీ, సందీప్ వంగ స్పిరిట్లో కూడా దీపికాను తీసుకోవాలని అనుకున్నారు. అయితే స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి వంగ దీపికా కలిసి స్క్రిప్ట్ కూడా వివరించారు. దీనికి గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిన ఆమె కొన్ని కండిషన్స్ పెట్టింది. రెమ్యునరేషన్తో పాటు పర్సంటేజ్.. అలాగే వర్కింగ్ అవర్స్‌లో లిమిట్ పెట్టిందని టాక్. ఆమె కండిషన్స్కి షాకైన టీం ఆమెను వద్దని.. త్రిప్తి డిమ్రిని తీసుకున్నారు.
ఈ వ్యవహరంలో దీపికా కాస్తా దురుసుగా వ్యవహరించిందట. స్పిరిట్ స్టోరీని పీఆర్లతో లీక్ చేయించాలని చూసిందట. అది తెలిసి అప్రమత్తమైన సందీప్ రెడ్డి.. పరోక్షంగా ఆమెను హెచ్చరించాడు. ఈ విషయం తెలిసి ప్రభాస్ కూడా దీపికాపై మండిపడ్డాడట. ఇలా వీరిద్దరి మధ్య వివాదం ముదరడంతో కల్కి 2లో ఆమె వద్దని దర్శక–నిర్మాతలకు ప్రభాస్ సూచించినట్టు సమాచారం. ప్రభాస్ సూచన మేరకు దీపికాను మూవీ నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కల్కి 2 దీపికాను తొలగించడంతో ఆమె స్థానంలో ఎవరూ తీసుకుంటారనేది ఆసక్తిని చర్చనీయాంశమైంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కల్కిలో దీపికాది కీలక రోల్. ప్రెగ్నెంట్ ఉమెన్ గా అమ్మ పాత్రలో కనిపించింది. ఆ పాత్రలో దీపికా చాలా బాగా ఒదిగిపోయింది. ఇప్పుడు ఆమెను తీసేయడంతో మళ్లీ ఆ పాత్రలో నటించే నటి.. ఆడియన్స్ ఆప్ట్ చేసుకునేలా ఉండాలి.
ఇక దీపికాను రీప్లేస్ చేయాలంటే ఎవరూ ఉన్నారా? అని అంతా ఆలోచలో పడ్డారు. ప్రస్తుతం మూవీ టీం నటి కోసం వేతికే పనిలో ఉన్నారట. ఆ స్థానంలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ప్రియాంక పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హిందీలో దీపికా స్థాయిలో గుర్తింపు ఉన్నది వీరికే. ఇక ప్రియాంక కూడా ప్రస్తుతం మహేష్ SSMB29లో నటిస్తోంది. కాబట్టి..తెలుగు ఆడియన్స్ కూడా ఆమెను ఓన్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఆర్ఆర్ఆర్తో ఆలియా ఇప్పటి టాలీవుడ్లో అడుగుపెట్టింది. కాబట్టి ఆమెను కూడా తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం ఉంది. కల్కి 2లో దీపికాను రీప్లేస్ చేయాలంటే బాలీవుడ్లో వీరిద్దరే ఉన్నారు. ఒకవేళ తెలుగు వాళ్లలో అంటే పూజ హెగ్డే అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం అనుష్క శెట్టి తీసుకోండి అంటూ మూవీ టీం సూచిస్తున్నారు. ఇక వీరెవరూ కాదంటే.. సందీప్ రెడ్డి వంగాలాగే.. త్రిప్తి డిమ్రిని తీసుకుంటారా? అనే అభిప్రాయం వస్తుంది. మరి కల్కి 2లో దీపికా రీప్లేస్ చేసే ఆ నటి ఎవరో తెలియాలంటే మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేయిట్ చేయాల్సిందే.