BigTV English

Deepika Padukone: కల్కి2 నుంచి దీపికా అవుట్.. సందీప్ రెడ్డి రియాక్షన్ చూసారా?

Deepika Padukone: కల్కి2 నుంచి దీపికా అవుట్.. సందీప్ రెడ్డి రియాక్షన్ చూసారా?

Deepika Padukone:దీపిక పదుకొనే (Deepika Padukone) .. బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తొలిసారి నాగ్ అశ్విన్ (Nag Ashwin ) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా వచ్చిన ‘కల్కి 2898 AD’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఇందులో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఈ సినిమా సీక్వెల్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అలా కల్కి2లో కూడా దీపిక నటించబోతోందని వార్తలు రాగా.. ఇప్పుడు అధికారికంగా ఈమెను ఈ సినిమా నుంచి తప్పించినట్లు వైజయంతి మూవీ మేకర్స్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.


కల్కి 2 నుంచీ కూడా ఔట్..

ఈ మేరకు.. “చిత్ర బృందం జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాము. కల్కి2లో దీపిక భాగం కాదని అధికారికంగా తెలియజేస్తున్నాము.. మొదటి భాగం కోసం ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినా.. రెండవ భాగంలో ఆమె భాగస్వామి కాలేక పోయింది. మరో కొత్త టీం తో మీ ముందుకు వస్తామంటూ” వైజయంతి మూవీస్ పోస్ట్ పెట్టింది. నిర్మాణ సంస్థ ప్రకటనతో అభిమానులందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో తాజాగా సందీప్ రెడ్డి వంగ పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. కల్కి2 నుంచి దీపికాని తప్పిస్తున్నట్లు వైజయంతి మూవీ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ను ఆయన ట్యాగ్ చేస్తూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు. దీంతో దీపిక అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కర్మ రిపీట్ అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

ఫేక్ ఐడి..


ఇకపోతే ఈ ఎక్స్ ఐడి ఫేక్ అని తెలుస్తోంది. అది సందీప్ రెడ్డి వల్ల అఫీషియల్ అకౌంట్ కాదని సమాచారం. ఎవరో కావాలనే ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావడానికి ఇలా నవ్వుతున్న ఏమోజీలు షేర్ చేసినట్లు తెలుస్తోంది.

దీపిక Vs సందీప్ రెడ్డి వంగా..

అసలు విషయంలోకి వెళ్తే.. సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ (Prabhas ) దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ ప్రకటించారు. ఇందులో దీపికా పదుకొనేను ఆయన హీరోయిన్గా ఎంపిక చేస్తూ అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే దీపిక తన కుమార్తె, వ్యక్తిగత బాధ్యతల దృష్ట్యా రోజుకు ఎనిమిది గంటల పని దినాలను కోరుతూ అభ్యర్థించింది. అయితే ఈ అభ్యర్థనతో దర్శకుడు సందీప్ రెడ్డివంగ విభేదించినట్లు వార్తలు వినిపించాయి. దాంతో ప్రాజెక్టు నుంచి దీపికా పదుకొనే తప్పుకోవాలని నిర్ణయించుకోగా.. అటు సందీప్ రెడ్డివంగా స్వయంగా ఆమెను సినిమా నుంచి తప్పిస్తూ తన నిర్ణయం ప్రకటించారు. పైగా అత్యధిక పారితోషకం డిమాండ్ చేసిందని కూడా సంచలన కామెంట్లు చేశారు.

దీపిక పీఆర్ టీం పై సందీప్ స్పందన..

అయితే దీపికాను సినిమా నుంచి తప్పించడంతో దీపిక పదుకొనే పీఆర్ టీమ్.. సినిమా కథను లీక్ చేయడమే కాకుండా.. ఆడవారిని కించపరిచేలా మాట్లాడారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీనితో మండిపడ్డ సందీప్ రెడ్డివంగా దీపిక పదుకొనే “డర్టీ పీఆర్ గేమ్” లు ఆడుతోంది అంటూ ఆరోపిస్తూ ఒక పోస్ట్ కూడా పంచుకున్నారు.

 

సందీప్ స్పందన పై దీపిక ప్రతిస్పందన..

అయితే డర్టీ పీఆర్ గేమ్ అంటూ సందీప్ రెడ్డి వంగా సంబోధించడంతో మండిపడ్డ దీపిక.. ఒక ఈవెంట్లో.. “జీవితంలో సమతుల్యత కోసం నిజాయితీ ముఖ్యం. కష్ట సమయాల్లో నా మనసు చెప్పింది నేను వింటాను” అంటూ తెలిపింది. అలా వీరిద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇందులో చాలామంది సెలబ్రిటీలు కూడా ఇన్వాల్వ్ అవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

దీపికా స్థానంలో యానిమల్ బ్యూటీ..

ఇక మొత్తానికి దీపికాను తప్పించి యానిమల్ సినిమాతో సెలబ్రిటీగా మారిన త్రిప్తి డిమ్రిని రంగంలోకి దింపారు సందీప్ రెడ్డివంగా. ఇప్పుడు కల్కి 2 నుంచి కూడా ఈమెను తప్పించడంతో మరొకసారి ఆయనను ట్యాగ్ చేస్తున్నట్లు సమాచారం.

Related News

Deepika Padukone: అయ్యో దీపికా.. టాలీవుడ్‌లో ఒకే ఒక్కడు సపోర్ట్… అయినా డ్యామేజ్ జరిగిపోయింది

Deepika Padukone: శభాష్ తెలుగు ప్రొడ్యూసర్స్.. దీపికా ఇష్యూపై నెటిజన్స్ మాటలు ఇవి

OG Trailer: సర్‌ప్రైజ్‌.. ‘ఓజీ’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. ఎప్పుడంటే!

Deepika Padukone: ‘కల్కి 2’ నుంచి దీపికా అవుట్‌.. ఆమెను రీప్లేస్‌ చేసేది ఎవరంటే?

Sudigali Sudheer: పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో.. ప్రియాంక, శివ్ ల పరువు తీసిన సుధీర్

Pawan Kalyan: పవన్‌పై పడి ఏడ్చేవాళ్లంతా.. మళ్లీ ఆయన సినిమాలోనే కనిపిస్తారా?

Movies in Theater : ఈ వారం థియేటర్స్‌లో 8 సినిమాలు.. లాభాలు మాత్రం గుండు సున్నా?

Big Stories

×