Paneer Tikka Masala: పనీర్ టిక్కా మసాలా పేరు వింటేనే చాలా మంది నోరూరిపోతుంది. పన్నీర్ తో తయారు చేసే ఈ కర్రీ చాలా రుచికరంగా ఉంటుంది. దీనిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు కూడా. తరచుగా పన్నీర్ తినే వారు , నాన్ వెజ్ తినడం అలవాటు లేని వారు పన్నీర్ టిక్కా మసాలా కర్రీని తయారు చేసుకుని తినవచ్చు. చాలా క్కువ సమయంలో ఈ రెసిపీ రెడీ చేయొచ్చు. ఇంతకీ ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ఏ ఏ పదార్థాలు అవసరం, తయారీ విధానం గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ టిక్కా మసాలా కర్రీ కోసం కావలసిన పదార్థాలు:
పనీర్ – 250 గ్రాములు (పెద్ద ముక్కలుగా కట్ చేయాలి)
ఉల్లిపాయ – 1 (పెద్ద ముక్కలుగా కట్ చేయాలి)
క్యాప్సికమ్ (బెల్ పెప్పర్) – 1 (పెద్ద ముక్కలుగా కట్ చేయాలి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
పెరుగు – 1/2 కప్పు
కారం పొడి – 1 టీ స్పూన్
పసుపు – 1/2 టీ స్పూన్
గరం మసాలా – 1/2 టీ స్పూన్
చాట్ మసాలా – 1/2 టీ స్పూన్
నిమ్మరసం – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
తయారీ విధానం:
1. ఒక గిన్నెలో పైన తెలిపిన మోతాదుల్లో పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, నిమ్మరసం, ఉప్పు కలిపి బాగా కలుపుకోవాలి.
2. ఈ మిశ్రమంలో పనీర్, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలను వేసి బాగా కలపాలి. ముక్కలకు మసాలా బాగా పట్టేలా చూసుకోవాలి.
3. ఈ మిశ్రమాన్ని 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు పక్కన పెట్టాలి.
4. ఇప్పుడు, పనీర్ ముక్కలను, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలను స్కూవర్స్‌లో గుచ్చి, నేరుగా మంటపై లేదా పాన్‌లో కొద్దిగా నూనెతో వేయించాలి. అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేవరకు వేయించాలి.
గ్రేవీ కోసం కావలసిన పదార్థాలు:
టమాటో – 3 (ప్యూరీ చేయాలి)
ఉల్లిపాయ – 1 (చిన్నగా తరిగింది)
అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు – 10-12 (పేస్ట్ చేయాలి)
కారం పొడి – 1 టీ స్పూన్
పసుపు – 1/2 టీ స్పూన్
గరం మసాలా – 1 టీ స్పూన్
కసూరి మేతి – 1 టీ స్పూన్
క్రీమ్ లేదా వెన్న – 2 టేబుల్ స్పూన్లు
చక్కెర – 1/2 టీ స్పూన్ (ఐచ్ఛికం)
ఉప్పు – తగినంత
నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
నూనె వేడయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యేవరకు వేయించాలి.
అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
ఇప్పుడు టమాటో ప్యూరీ, కారం పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం నూనె విడిచే వరకు ఉడికించాలి.
జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇది గ్రేవీకి చిక్కదనం, మంచి రుచిని ఇస్తుంది.
ఇప్పుడు తగినంత నీరు లేదా పాలు పోసి గ్రేవీని బాగా ఉడికించాలి.
Also Read: పెసరట్టు చేయడం చాలా ఈజీ.. ఇంట్లో ఈ పొడి ఉంటే క్షణాల్లోనే రెడీ !
గ్రేవీ చిక్కబడిన తర్వాత.. గరం మసాలా, కసూరి మెంతి, చక్కెర, క్రీమ్ వేసి బాగా కలపాలి.
చివరగా.. ముందుగా వేయించిన పనీర్ టిక్కా ముక్కలను గ్రేవీలో వేసి 5 నిమిషాలు ఉడికించాలి.
కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
ఈ రుచికరమైన పనీర్ టిక్కా మసాలాను బటర్ నాన్, చపాతీ లేదా పులావ్ వంటి వాటితో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఇది ఇంటికి గెస్ట్‌లు వచ్చినప్పుడు లేదా పండగ సమయంలో ఎప్పుడూచెసే పన్నీర్ కర్రీ కాకుండా ఇలా పత్యేకంగా పన్నీర్ టిక్కా మసాలా తయారు చేసి అందరికీ వడ్డించండి.