Sudigali Sudheer: సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం వరుస షోస్ తో బిజీగా మారాడు. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్.. హీరోగా మారి గాలోడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత గోట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు అనుకున్నారు. కానీ, ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో మళ్లీ బ్యాక్ ట బుల్లితెర అంటూ షోస్ కు యాంకర్ గా మారాడు.
ప్రస్తుతం సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో చేస్తున్నాడు. సీరియల్, సోషల్ మీడియా స్టార్స్ ను పిలిచి, వారితో ఆటలు, పాటలు ఆడిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే షో అది. ఇక తాజా ఎపిసోడ్ లో సుధీర్.. సీరియల్ హీరోయిన్, బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ ను, ఆమె బాయ్ ఫ్రెండ్ శివ్ ను ఆట పట్టించాడు. ఇంకా చెప్పాలంటే పరువు తీశాడు.
మౌనరాగం సీరియల్ తో ప్రియాంక, శివ్ సీరియల్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సీరియల్ లో వీరి పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ.. పెళ్లి వరకు వెళ్తుంది అని అందరూ ఎదురుచుస్తున్నారు. కానీ, ఈ జంట మాత్రం పెళ్లి తప్ప అన్ని చేస్తున్నారు. ఒకే ఇంట్లో కలిసి ఉంటూనే.. తమ కెరీర్స్ లో బిజీగా మారారు. పెళ్లి కాకుండానే ఇద్దరు భార్యభర్తలుగా. కలిసి ఉంటున్నారు.
అంతేకాకుండా ప్రియాంక వ్రతాలు చేయడం. పూజలు చేయడం.. వెకేషన్స్ కి, టెంపుల్స్ కి వెళ్లడం, శివ్ ఎవరితోనైనా కలిసి ఉంటె ప్రియాంక రెచ్చిపోయి మండిపడడం ఇలాంటివన్నీ చూసి ప్రేక్షకులు విసిగిపోయారు. చాలామంది విమర్శించారు కూడా. అయినా కూడా అవేమి పట్టించుకోకుండా వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.
ఇక దాని గురించే ఈ షోలో సుధీర్వారిని ప్రశ్నించాడు. నా లిప్స్టిక్ తెచ్చావా.. నా బ్యాగ్ తెచ్చావా అని ప్రియాంక, శివ్ ని అడుగుతుంటే, సుధీర్.. ఏంటి ఒకే ఇంట్లో నుంచి వచ్చినట్లు అవి తెచ్చావా అని అడుగుతున్నావు అని ప్రశ్నిస్తాడు. అందుకు ప్రియాంక మేము ఒకే ఇంట్లో ఉంటున్నామని చెప్పగా.. ఓహో పెళ్లి అయ్యిపోయిందా అని సుధీర్ అడుగుతాడు. దానికి శివ్.. ఒకే ఇంట్లో ఉండడానికి పెళ్లి ఎందుకు అని అంటాడు. ఏంటి.. పెళ్లి కాకుండా ఓకే ఇంట్లో ఉంటున్నారా.. ఇలాంటి అప్షన్ ఒకటుందా అంటూ వారిని ఆటపట్టించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.