Pawan Kalyan:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో.. విలక్షణ నటుడిగా.. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఈయన. ఒకవైపు హీరో గానే కాకుండా మరొకవైపు రాజకీయ నాయకుడిగా కూడా చలామణి అవుతున్నారు. దాదాపు పది సంవత్సరాలు నిర్విరామ శ్రమ తర్వాత ఆంధ్రప్రదేశ్ కి గత ఏడాది డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఒకవైపు అధికారాన్ని చక్కగా నిర్వర్తిస్తూనే.. మరొకవైపు అభిమానులను అలరించడానికి సినిమాలు కూడా చేస్తూ బిజీగా మారిపోయారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ఓజీ (OG). ప్రముఖ డైరెక్టర్ సుజీత్(Sujith ) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య (DVV danayya) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ (Priyanka mohan) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తాజాగా ప్రకాష్ రాజ్ (Prakash Raj)నటిస్తున్నట్లు ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్ విడుదల చేశారు. ఇందులో “సత్యా దాదా” అనే పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నట్లు.. ఆయన పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు విమర్శలు కూడా వినిపిస్తున్నాయని చెప్పాలి.
మండిపడుతున్న పవన్ అభిమానులు..
అసలు విషయంలోకి వెళ్తే.. ఉదయం లేచింది మొదలు ఎప్పుడెప్పుడు అవకాశం లభిస్తుందా? పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడదామా? అని చెలరేగిపోయే ప్రకాష్ రాజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం ఏంటి? అంటూ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే..MAA అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ , మెగాస్టార్ చిరంజీవి ఎంతో సహాయం చేశారు. అయితే అవేవీ దృష్టిలో పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ ను నేరుగా టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ అభిమానులు కూడా యాక్సెప్ట్ చేయలేని ఎన్నో పదాలు వాడి ఆయనపై విరుచుకుపడ్డారు.. అలాంటి ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలోనే “దాదా”పాత్ర చేస్తున్నాడని మేకర్స్ అనౌన్స్ చేయడంతో..”పొద్దున్నే లేస్తే పవన్ కళ్యాణ్ ను ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమాలోనే అవకాశం దక్కించుకున్నాడు.. పవన్ పై ఏడ్చే వాళ్లంతా మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాలోనే కనిపిస్తారా? ఏంటి ? ” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
also read:Movies in Theater : ఈ వారం థియేటర్స్‌లో 8 సినిమాలు.. లాభాలు మాత్రం గుండు సున్నా?
అప్పుడు సత్యరాజ్.. ఇప్పుడు ప్రకాష్ రాజ్..
ఇకపోతే ప్రకాష్ రాజ్ మాత్రమే కాదు సత్యరాజ్ (Sathyaraj) కూడా పవన్ కళ్యాణ్ సినిమాలోనే కనిపించి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. గతంలో పవన్ కళ్యాణ్ పై సత్యరాజ్ ఏ రేంజ్ లో విరుచుకుపడ్డారో అందరికీ తెలిసిందే. అయితే అలాంటి ఈయన కూడా పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో పూజారి పాత్రలో కనిపించారు. ముఖ్యంగా సత్యరాజ్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నట్లు అనౌన్స్మెంట్ రాగానే వెంటనే ఆయనను ఆ సినిమా నుంచి తీసేయాలని అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన విషయం కూడా తెలిసిందే. కానీ సత్యరాజ్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించారు. ఇక దీన్ని బట్టి చూస్తే అప్పుడు సత్యరాజ్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ అంటూ ఇక వీరికి వేరే ఛాన్స్ లేదు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి దీనిపై ప్రకాష్ రాజ్ ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.
Here’s the versatile force Prakash Raj in #OG 🔥#TheyCallHimOG @prakashraaj pic.twitter.com/NiKjAtc1Qv
— DVV Entertainment (@DVVMovies) September 18, 2025