Asia Cup 2025 : ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ 14న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అయితే ఆ వివాదంతోనే మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాప్ట్ తొలగించాలని డిమాండ్ చేసింది పీసీబీ. అయితే ఐసీసీ మాత్రం అందుకు నిరాకరించింది. పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఐసీసీ ఆడితే ఆడండి.. లేకపోతే లేదు అని తెగేసి చెప్పడంతో సచ్చినట్టు వచ్చి ఆడారు పాకిస్తాన్ ఆటగాళ్లు. తాజాగా టీమిండియా పై కూడా అలాంటి ప్రపోజలే పెట్టినట్టు సమాచారం.
Also Read : AFG vs SL, Asia Cup 2025: నేడు లంకతో మ్యాచ్..ఆఫ్ఘనిస్తాన్ కు చావో రేవో..గెలిచిన జట్టుకు సూపర్ 4 ఛాన్స్ !
గ్రూపు ఏ నుంచి సూపర్ 4 కి అర్హత సాధించిన జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. అ తరుణంలోనే సెప్టెంబర్ 21 నుంచి దుబాయ్ వేదికగా జరుగనున్న సూపర్ 4 మ్యాచ్ లో మెన్ ఇన్ బ్లూ.. మెన్ ఇన్ గ్రీన్ తాడోపేడో తేల్చుకోనున్నాయి. మరోసారి దాయాది పాకిస్తాన్ ను చిత్తు చేయాలని టీమిండియా ఉవ్విల్లూరుతోంది. లీగ్ దశలో పాకిస్తాన్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇస్తేనే వారితో మేము క్రికెట్ మ్యాచ్ ఆడుతామని చెప్పారట. అయితే షేక్ హ్యాండ్ కి, మ్యాచ్ రిఫరీకి ఎలాంటి సంబంధం లేదని.. ఆటగాళ్ల ఇష్టాన్ని బట్టి షేక్ హ్యాండ్ ఉంటుందని ఐసీసీ చెప్పింది. షేక్ హ్యాండ్ వివాదం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. మరోవైపు పాకిస్తాన్ ఆటగాళ్లు టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పై ఇష్టానుసారంగా కామెంట్స్ చేసి.. మళ్లీ తిరిగి సూర్యకుమార్ పొలిటికల్ కామెంట్స్ చేశాడు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మరోవైపు పాకిస్తాన్ ఆటగాళ్లు టీమిండియా అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ రెండింటిలో పోటీ ఇవ్వలేకపోయారు. దీంతో టీమిండియాతో మ్యాచ్ ని తప్పించుకునేందుకు కొత్తగా షేక్ హ్యాండ్ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు సమాచారం.
వాస్తవానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ పై దాడి చేయడంతో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకూడదని బాధితులు, క్రికెట్ అభిమానులు పేర్కొన్నారు. అందుకు మద్దతుగా టీమిండియా ఆటగాళ్లు వెల్లామా..? మ‌్యాచ్ ఆడామా..? వచ్చామా..? అన్నట్టు వ్యవహరించారు. ఒకవేళ పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ ఇచ్చి ఉంటే.. పహల్గామ్ బాధిత కుటుంబాలు, టీమిండియా అభిమానులు టీమిండియా వ్యతిరేకిస్తారనే ఉద్దేశంతో అలా చేసింది. వాస్తవానికి టీమిండియా తన దేశభక్తిని చాటుకుంది. అయితే దానిని రాద్దాంతం చేస్తూ పాకిస్తాన్ ఆటగాళ్లు, పీసీబీ మాత్రం టీమిండియాను ఎలాగైనా ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో షేక్ హ్యాండ్ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు.