BigTV English

Namibia vs Scotland : మ్యాచ్ జరుగుతుండగా కలకలం… ఒక్కసారిగా గ్రౌండ్ లో మంటలు.. అసలు ఏం జరిగిందంటే

Namibia vs Scotland : మ్యాచ్ జరుగుతుండగా కలకలం… ఒక్కసారిగా గ్రౌండ్ లో మంటలు.. అసలు ఏం జరిగిందంటే

Namibia vs Scotland :   సాధారణంగా క్రికెట్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వాతావరణం సరిగ్గా లేకపోవడంతో మ్యాచ్ రద్దు అవ్వడం.. వర్షం కారణంగా లేటుగా స్టార్ట్ అవ్వడం.. స్టేడియాల్లో ఇలా రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇవన్నీ మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. సాధారణంగా వర్షం పడితే మ్యాచ్ జరపడానికి గ్రౌండ్ స్టాప్ కష్టపడుతుంటారు. ఎప్పటికప్పుడు వర్షపు నీటిని తొలగించి గ్రౌండ్ సిద్ధం చేసే పనిలో ఉంటారు.   తాజాగా నమీబియా-స్కాట్లాండ్ ల మధ్య క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 లో ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడం విశేషం. 2027 వన్డే ప్రపంచ కప్ లో అర్హత సాధించాలంటే లీగ్ 2 మ్యాచ్ ల్లో విజేతలుగా నిలిచిన జట్లకే స్థానం ఉంటుంది.  కెనడా సిటీలోని ఒంటారియోలోని కింగ్ సిటీ వేదికగా మాపుల్ లీఫ్ నార్త్-వెస్ట్ గ్రౌండ్ ని  ఆరబెట్టేందుకు గ్రౌండ్ సిబ్బంది ఏకంగా పిచ్ పై నిప్పు అంటించారు. ఈ విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


Also Read : Salman Nizar – KCL : 6, 6, 6, 6, 6, 1, 6, 6, 6, 6, 6, 6… 12 బంతుల్లో 11 సిక్సర్లు..వీడియో చూస్తే

పిచ్ ఆరబెట్టేందుకు  మంట 


కెనడా లోని టొరంటోలో ఉన్న నార్త్ -వెస్ట్ గ్రౌండ్ లో స్కాట్లాండ్-నమీబియా మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ వర్షం అంతరాయం కలిగింది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అవుతుందని ప్రకటించారు.  కానీ వర్షం ఆగిపోయినప్పటికీ గ్రౌండ్ మాత్రం ఆరకపోవడంతో సిబ్బంది కాస్త భిన్నంగా ఆలోచించి గ్రౌండ్ లో మంట పెట్టారు. చివరకు కట్ ఆఫ్ సమయానికి కూడా మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ ని రద్దు చేస్తున్నట్టు అంఫైర్లు ప్రకటించారు. పిచ్ ఆరేందుకు మంట పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి మ్యాచ్ రద్దు చేయడానికి ముందు వర్షం ఆగిపోతుందని చాలా సమయం వరకు వేచి చూశారు. భారీ వర్షం కురవడంతో చాలా సమయం పట్టింది. మైదానాన్ని ఆరబెట్టేందుకు రకరకాల పద్దతులను ఉపయోగించినప్పటికీ రాత్రి 9.02 కట్ ఆఫ్ సమయంలో పిచ్ ను సిద్ధం చేయలేకపోయింది. దీంతో మ్యాచ్ ని రద్దు చేసి.. ఇరు జట్లకు చెరొక పాయింట్ పంచుకోవాల్సి వచ్చింది.

ఈ లీగ్ లో USA టాప్ 

పాయింట్ల పట్టిక లో ఈ లీగ్ లో ప్రస్తుతం USA అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2027 వన్డే వరల్డ్ కప్ కి సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నమీబియా 2027 ప్రపంచ కప్ ను నిర్వహిస్తున్నా ఐసీసీ పూర్తి సభ్య దేశం కాకపోవడంతో ఈ మెగా టోర్నీకి అర్హత సాధించాలంటే క్వాలిఫయర్ మ్యాచ్ లను ఆడాల్సిందే. అయితే కెనడా, నమీబియా జట్ల మధ్య గతంలో జరిగిన మ్యాచ్ గమనించినట్టయితే కెనడాను నమీబియా 5 వికెట్ల తేడాతో ఓడించింది. అయితే మ్యాచ్ జరగడానికి ముందు గ్రౌండ్ ఆరకపోవడంతో వర్షం ఆగిపోయిన తరువాత గ్రౌండ్ స్టాప్ పిచ్ నిప్పు అంటించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ సీన్స్ అన్ని కెమెరాలో రికార్డు చేశారు. పిచ్ కి నిప్పు అంటించిన ఫొటోలను స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ మారాయి. 


Related News

BCCI : రూ. 452 కోట్లకు టీమిండియా జెర్సీ స్పాన్సర్ షిప్.. బీసీసీఐ అదిరిపోయే స్కెచ్?

David Warner : మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో విలన్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్?

IPL 2026 : IPL 2026 కంటే ముందే పెను మార్పులు…ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్?

IND Vs PAK : ఆసియా కప్ లో పాక్ vs ఇండియా మ్యాచ్ షెడ్యూల్ లో మార్పు.. కొత్త టైమింగ్ ఇదే!

Lalit Modi : శ్రీశాంత్ భార్యపై లలిత్ మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు.. నీకేంటి నొప్పి అంటూ

Rajasthan Royals : రాజస్థాన్ జట్టులో ముసలం…ద్రవిడ్ తో పాటు సంజూ, జైస్వాల్ ఔట్?

Big Stories

×