Indian Railways: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య కీలక నిర్ణయం తీసుకుంది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్స్ ప్రమాదకర స్థితికి చేరడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా బాసర- నవీపేట్ మధ్య ఉన్న గోదావరి బ్రిడ్జి నంబర్ 434 దగ్గర భారీ వరదలు కారణంగా ట్రాక్ దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి బయల్దేరే రైలు సర్వీసులను క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. భద్రతలో భాగంగా ముందు జాగ్రత్తగా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఈ విభాగంలో నడుస్తున్న పలు సర్వీసులు ప్రభావితం కానున్నట్లు తెలిపారు. ఆగస్టు 31 సెప్టెంబర్ 1 మధ్య కొన్ని రైళ్లను పూర్తి, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయనున్నట్ల తెలిపారు. ప్రయాణీకులు రైళ్ల రద్దుకు సంబంధించిన వివరాలను తెలుసుకొని ప్రయాణాలు కొనసాగించాలని అధికారులు సూచించారు.
రద్దు అయిన రైళ్ల వివరాలు
వరదల కారణంగా రద్దు చేసిన రైళ్లకు సంబంధించిన వివరాలను రైల్వే అధికారులు ప్రకటించారు
⦿ రైలు నంబర్ 77603- కాచిగూడ- మెదక్: ఆగస్టు 31న ఈ రైలును రద్దు చేశారు.
⦿ రైలు నంబర్ 77604- మెదక్ – కాచిగూడ: ఈ రైలును సెప్టెంబర్ 1న క్యాన్సిల్ చేశారు.
⦿ రైలు నంబర్ 77653- సికింద్రాబాద్ – సిద్దిపేట: ఆగస్టు 31న ఈ రైలును రద్దు చేశారు.
⦿ రైలు నంబర్ 77654- సిద్దిపేట- సికింద్రాబాద్: ఆగస్టు 31న ఈ రైలు రద్దు చేశారు.
⦿ రైలు నంబర్ 77655- సికింద్రాబాద్- సిద్దిపేట: ఈ రైలును ఆగస్టు 31న క్యాన్సిల్ చేశారు.
⦿ రైలు నంబర్ 77656- సిద్దిపేట- సికింద్రాబాద్: సెప్టెంబర్ 1న ఈ రైలును రద్దు చేశారు.
రైల్వే బ్రిడ్జి దగ్గర ఎక్కువ నీటి ప్రవాహం కారణంగా ట్రాక్ బలహీన పడినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆ మార్గంలో రైళ్లను క్యాన్సిల్ చేసినట్లు ప్రకటించారు. ప్రయాణీకులు, సిబ్బంది భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: 7 రూట్లలో రెట్టింపు కాబోతున్న వందేభారత్ కోచ్ లు, ఇదీ క్రేజీ న్యూస్ అంటే!
కొన్ని సర్వీసుల పాక్షిక రద్దు
సికింద్రాబాద్, కాచిగూడ నుంచి పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. కాచిగూడ నుంచి మెదక్ కు నడిచే రైలు నంబర్ 57301 ఆగస్టు 31న అకనపేట వరకు మాత్రమే నడుస్తుందని అధికారులు తెలిపారు. అటు, మెదక్ నుంచి కాచిగూడ వరకు వెళ్లే సర్వీస్ నంబర్ 57302 అకనపేట నుంచి ప్రారంభమవుతుంది. మెదక్ నుండి అకనపేట విభాగం వరకు ఈ రైలు సేవలను రద్దు చేశారు. వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగే వరకు రైళ్లను పూర్తిగా రద్దు చేయడం లేదంటే, పాక్షికంగా రద్దు చేయడం కొనసాగుతుందన్నారు.
Read Also: తెలంగాణలో మరో వందేభారత్ కు హాల్టింగ్, రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్!