BigTV English

Big Shock To Trump: మోడీ దెబ్బ.. అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ అవుట్..

Big Shock To Trump: మోడీ దెబ్బ.. అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ అవుట్..

Big Shock To Trump: అన్ని దేశాలపై నోటికి వచ్చినంత టారిఫ్ లు వేసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్. అమెరికన్ అప్పీల్స్ కోర్టు ఇవేం సుంకాలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ సుంకాలను తప్పు బట్టింది. జాతీయ అత్యవసర చట్టాన్ని ఇలా విచ్చలవిడి టారిఫ్ లు విధించేందుకు ఎవరైనా ఉపయోగిస్తారా అని మండిపడింది. మిడ్ అక్టోబర్ వరకు మాత్రమే వీటిని అంగీకరిస్తామన్నది. ఆ తర్వాత కుదరదన్నది. దీంతో బంతి US సుప్రీం కోర్టులో పడినట్లైంది. సుప్రీం కోర్టులో అప్పీల్ కు ట్రంప్ రెడీ అవుతున్నారు.


ట్రంప్ కు US అప్పీల్స్ కోర్టు బిగ్ షాక్..

అంతా నా ఇష్టం.. నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే రోజూ అది కుదరదు. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఇది ట్రంప్ కూ వర్తిస్తుంది. తాజాగా ట్రంప్ విధించిన పిచ్చి టారిఫ్ లకు యూఎస్ అప్పీల్స్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇవేం టారిఫ్ లు అంటూ క్వశ్చన్ చేసింది. జాతీయ అత్యవసర చట్టాన్ని ఇలా ఎవరైనా వాడుకుంటారా అని ప్రశ్నించింది. 7-4 తీర్పుతో జడ్జిలు ట్రంప్ సుంకాలపై తీర్పు ఇవ్వడం అమెరికాలో సంచలనంగా మారింది. ఇప్పటికే చాలా మంది అమెరికన్ ఎకానమీ నిపుణులు.. ఇలాంటి టారిఫ్ లు అమెరికాకే నష్టం చేస్తాయని కామెంట్లు చేస్తున్న సమయంలో ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పు కీలకంగా మారింది.


ఏప్రిల్ 2న సుంకాల మోత మోగింపు

ఈ ఏడాది ఏప్రిల్ 2న ట్రంప్ ఈ సుంకాలను లిబరేషన్ డే అని పిలిచి, అమెరికాతో వాణిజ్య లోటు ఉన్న దేశాలపై 50% వరకు సుంకాలు విధించారు. వీటికి తోడు చాలా దేశాలపై 10% బేస్‌లైన్ టారిఫ్ లు వేశారు. చైనా, మెక్సికో, కెనడాలు అమెరికా సరిహద్దుల ద్వారా డ్రగ్స్, అక్రమ వలసలను నియంత్రించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ ఈ మూడు దేశాలపై ప్రత్యేక సుంకాలు విధించారు. 1977 ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ – IEEPA చట్టాన్ని ప్రయోగించారు. దీన్ని ట్రంప్ అమెరికా వాణిజ్య లోటు, డ్రగ్ ట్రాఫికింగ్‌ను జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించడానికి ఉపయోగించారు. ఈ సుంకాలను అమెరికన్ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి, జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, వాణిజ్య లోటును తగ్గించడానికే వేశామని వాదించారు. అయితే ఈ టారిఫ్ లు ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితిని, ధరల పెరుగుదల భయాలను, ఆర్థిక వృద్ధి మందగమన భయాలను కల్పించాయి.

ట్రంప్ టారిఫ్‌లు చట్టవిరుద్ధమని తీర్పు

సీన్ కట్ చేస్తే ట్రంప్ టారిఫ్ ల మ్యాటర్ యూఎస్ ఫెడరల్ అప్పీల్ కోర్టుకు చేరాయి. అక్కడ ట్రంప్ కు బిగ్ షాక్ ఇస్తూ తీర్పు వెలువడింది. 7-4 తీర్పుతో ట్రంప్ విధించిన రెసిప్రొకల్ సుంకాలు అలాగే చైనా, మెక్సికో, కెనడాపై విధించిన టారిఫ్ లు చట్టవిరుద్ధమని తీర్పు ఇచ్చింది. మే లో న్యూయార్క్‌ ట్రేడ్ కోర్టు ఇచ్చిన తీర్పును ఫెడరల్ అప్పీల్ కోర్టు సమర్థించింది. ట్రంప్ 1977 IEEPA చట్టాన్ని ఉపయోగించి విధించిన సుంకాలు కరెక్ట్ కాదన్నది కోర్టు. IEEPA యాక్ట్ లో సుంకాలు విధించే అధికారం స్పష్టంగా పేర్కోలేదని, ఈ చట్టం సాధారణంగా శత్రు దేశాలపై ఆంక్షలు లేదా ఆస్తుల ఫ్రీజింగ్ వరకే పరిమితం అవుతుందన్న విషయాన్ని ప్రస్తావించింది కోర్టు. అంతే కాదు.. IEEPA కింద సుంకాలు విధించడం అనేది కాంగ్రెస్‌కు ఉన్న రాజ్యాంగబద్ధమైన అధికారాన్ని ఉల్లంఘించడమే అని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. చాలా దేశాలతో వాణిజ్య లోటు దశాబ్దాలుగా ఉంటే.. దాన్ని అకస్మాత్తు అత్యవసర పరిస్థితిగా పేర్కొనడం కరెక్టేనా అని ట్రంప్ ప్రభుత్వాన్ని నిలదీసింది కోర్టు.

సుంకాల అధికారాన్ని ట్రంప్ అతిగా వాడారా?

US రాజ్యాంగం ప్రకారం సుంకాలు విధించే అధికారం అమెరికన్ కాంగ్రెస్‌కు ఉంది. గతంలో కొంతమంది అమెరికన్ అధ్యక్షులు ఈ అధికారం కొంతవరకు వాడినా… ప్రస్తుతం ట్రంప్ మాత్రం ఈ అధికారాన్ని అతిగా ఉపయోగించారని కోర్టు తీర్పు ఇచ్చింది. అపరిమిత అధికారం ఉందని వాదించిన ట్రంప్ కు చెక్ పెట్టింది తీర్పు. రాజ్యాంగ బద్ధ అధికారాలను ఉల్లంఘించడమే అని అన్నది. అయితే యూఎస్ ఫెడరల్ కోర్టు ఈ సుంకాలను వెంటనే రద్దు చేయకుండా, అప్పీల్ కోసం యు.ఎస్. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చింది. అక్టోబర్ 14 వరకు సుంకాలను కొనసాగించడానికి అనుమతించింది. ఈ నిర్ణయం ట్రంప్‌కు తాత్కాలిక ఊరటనిచ్చినప్పటికీ, ఇది ఆయన వాణిజ్య విధానాలకు పెద్ద దెబ్బే. భారత్ సహా చాలా దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్.. కోర్టు ఆదేశిస్తే వెంటనే వెనక్కు తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కోర్టు నిర్ణయం సుంకాలను రద్దు చేస్తే, కంపెనీలు ఈ సుంకాల వల్ల జరిగిన నష్టాలకు రీయింబర్స్‌మెంట్ కోరవచ్చు. అయితే, సుంకాలు తాత్కాలికంగా కొనసాగడం వల్ల, అమెరికాతో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న దేశాలు తమ ఒప్పందాలపై పునరాలోచన చేయవచ్చు, ఇది మరింత అనిశ్చితిని సృష్టించవచ్చు. మరోవైపు సుంకాలను రద్దు చేస్తే యు.ఎస్. విదేశీ విధానం, జాతీయ భద్రతకు హాని అంటూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదిస్తోంది.

సుప్రీం కోర్టుకు ట్రంప్ యంత్రాంగం

సో తాజాగా ఫెడరల్ అప్పీల్ కోర్టు నిర్ణయంతో టారిఫ్ ల మ్యాటర్ సుప్రీం కోర్టుకు చేరుకున్నట్లైంది. ట్రంప్ యంత్రాంగం సుప్రీంలో అప్పీల్ చేసుకోవడం ఖాయమే. ఈ టారిఫ్ లు అసలు చట్టబద్ధమైనవో కావో.. అక్కడే తేలుతుంది. అమెరికన్ సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ పెరుగుతోంది. అక్కడ ఏం జరుగుతుంది.. ఎలాంటి తీర్పు వెలువడుతుందన్న ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా భారత్ పై ట్రంప్ వేసిన 50 శాతం టారిఫ్ లపై ప్రపంచవ్యాప్తంగా అంతెందుకు అమెరికాలోనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా ఆయిల్ కొనొద్దని ఆర్డర్ వేసినా భారత్ ఏమాత్రం తగ్గడం లేదు. అంటే అమెరికానూ డోంట్ కేర్ అన్న పొజిషన్ లో ఇండియా ఉంది. అలాంటప్పుడు ట్రంప్ ఎత్తుగడ ఏం వర్కవుట్ అయినట్లు? మోడీకి ట్రంప్ ఫోన్ చేసే ప్రయత్నాలు చేసినా ఆ కాల్స్ తీసుకునే పొజిషన్ లో భారత్ లేదు.

సుప్రీంలో వ్యతిరేక తీర్పు వస్తే ప్లాన్ బి లో ట్రంప్

భారత్ వంటి దేశాలపై టారిఫ్ లను యూఎస్ సుప్రీం కోర్టు వ్యతిరేకిస్తే మన టెక్స్‌టైల్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్నాలజీ రంగాలకు ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ సుంకాలు రద్దయితే భారత ఎగుమతిదారులకు ఊరట కలుగుతుంది. సో యూఎస్ సుప్రీం కోర్టులో అసలు IEEPA చట్టం ప్రకారం సుంకాలు విధించే అధికారం ఎవరికి ఉంది.. ఏ సందర్భంలో వేయొచ్చు.. ఎవరికి వేయొచ్చు.. ఇలాంటి విషయాలపై వాదోపవాదాలు జరుగుతాయి. సుప్రీం కోర్టు తీర్పు ఈ టారిఫ్ ల ఫ్యూచర్ ను డిసైడ్ చేయబోతోంది. ఒకవేళ సుప్రీంలో ట్రంప్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తే ప్లాన్ బి తో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అదేంటంటే.. ఈ సుంకాలను కొనసాగించడానికి ట్రంప్ ఇతర చట్టాలను అంటే 1974 ట్రేడ్ యాక్ట్ లేదా 1930 ట్రేడ్ యాక్ట్ ను ప్రయోగించే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే ఈ చట్టాలు 15% సుంకాలను 150 రోజుల వరకు మాత్రమే అనుమతిస్తాయి. అంటే ట్రంప్ కు పెద్దగా వర్కవుట్ కాదు. మరోవైపు ట్రంప్ వేసిన టారిఫ్ లు ప్రపంచ వాణిజ్య సంస్థ దాకా వెళ్లాయి. కానీ అమెరికా 2019 నుండి WTO అప్పీలేట్ బాడీని నిలిపేయడంతో ఈ వివాదాలు పరిష్కారం కాకపోవచ్చు. మ్యాటర్ ఇలాగే కొనసాగితే భారత్ కూడా ప్రతీకార సుంకాలు విధించే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధమే.

అసలు భారత్ పై ట్రంప్ ఎందుకు ఉన్నట్లుండి 50 శాతం టారిఫ్ లు విధించారు? పైకి రష్యన్ ఆయిల్ అంటున్నా.. లోలోపల ట్రంప్ ఇగో కారణాలే ఉన్నాయి. భారత్ – పాక్ ఉద్రిక్తతల్లో ట్రంప్ మధ్యవర్తిత్వంపై మనం అస్సలు క్రెడిట్ ఇవ్వలేదు. ఇది బాగా మనసులో పెట్టుకున్నారని అందుకే భారత్ పై వాణిజ్య యుద్ధం మొదలు పెట్టారని అమెరికన్ లీడర్లే అంటున్నారు. మరోవైపు ట్రంప్ అనారోగ్యం చుట్టూ ఆందోళనలు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా పబ్లిక్ లో ట్రంప్ కనిపించడం లేదు. ఎందుకు? ఆయనకు ఏమైంది?

కోర్టు తీర్పుతో USకు నష్టమంటున్న ట్రంప్

ట్రంప్ విధించిన టారిఫ్ లపై అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా చర్చ పెరుగుతోంది. తాజాగా యూఎస్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు ఇచ్చిన తీర్పుతో అది మరింత పెరిగింది. దీనిపై ట్రంప్ ట్రూత్ పోస్ట్ లో రియాక్ట్ అయ్యారు. కోర్టు తీర్పు అమెరికాకు ఎంతో నష్టం కలిగిస్తుందని, అమెరికా విధించిన సుంకాలు ప్రస్తుతం అన్ని దేశాలపై అమలులో ఉందని, ఒకవేళ ఈ టారిఫ్‌లను తొలగిస్తే దేశ చరిత్రలోనే ఒక విపత్తు అవుతుందని రాసుకొచ్చారు. ఈ ప్రక్రియలో చివరకు అమెరికా విజయం సాధిస్తుందని, వాణిజ్య లోటును పూడ్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవడానికి టారిఫ్ లే బెటర్ వే అని ట్రంప్ అంటున్నారు. మన తయారీదారులను, రైతులను అణగదొక్కేందుకు మిత్ర దేశాలైనా, శత్రుదేశాలైనా అనైతికంగా విధించే టారిఫ్‌లు, అపారమైన వాణిజ్య లోటు, వాణిజ్య అడ్డంకులను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, ఒక వేళ టారిఫ్‌లు ఎత్తివేస్తే ఈ నిర్ణయం అమెరికాను నాశనం చేస్తుందంటున్నారు ట్రంప్. అమెరికా ఉత్పత్తులను తయారు చేస్తున్న మన కంపెనీలకు మద్దతుగా నిలబడాలని, చాలా ఏళ్లుగా మన రాజకీయ నాయకులు టారిఫ్‌లను అమెరికాకే వ్యతిరేకంగా ఉపయోగించారన్నారు. యూఎస్‌ సుప్రీంకోర్టు సహాయంతో టారిఫ్‌లను అమెరికా ప్రయోజనాల కోసం ఉపయోగించి దేశాన్ని బలమైన, ధనిక, శక్తివంతమైందిగా మారుస్తానంటున్నారు.

భారత్ పై 50 శాతం టారిఫ్‌లను తప్పుబట్టిన జేక్ సులేవాన్

మరోవైపు డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌లపై విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు జేక్‌ సులేవాన్‌ కూడా భారత్‌ పై 50 శాతం సుంకాలను తప్పుబట్టారు. వీటి కారణంగా అమెరికన్ బ్రాండ్ పతనమైందని ఆందోళన వ్యక్తంచేశారు. మిత్ర దేశాలతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు అమెరికాకు భాగస్వామిగా ఉండేందుకు ఇష్టపడటం లేదన్నారు. USతో జట్టు కడితే మనకే నష్టం అనుకునే పొజిషన్ లోకి చాలా దేశాలు వెళ్లాయి. ఈక్రమంలో చైనా వైపు ఆదరణ పెరిగిపోతుందన్నారాయన. ఇందుకు కారణాలనూ చూపెడుతున్నారు. టారిఫ్ లతో అమెరికా హేట్ చేస్తే చైనా అన్ని దేశాలను దగ్గర తీస్తున్న విషయాలను గ్రహించాలంటున్నారు. ముఖ్యంగా ఉప్పు నిప్పుగా ఉండే భారత్ – చైనాలు ట్రంప్ టారిఫ్ ల తర్వాత వాణిజ్యపరంగా దోస్తీని పెంచుతున్నాయి. అమెరికా-భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయంటున్నారు. ఇంకొందరైతే.. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్‌ బ్రాండ్ టాయిలెట్‌లో ఉందంటున్నారు.

అమెరికా శాశ్వత మిత్రుడేమీ కాదన్న సిగ్నల్స్

అమెరికా టారిఫ్ లపై భారత్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రెడీ అంటున్నారు. భారత్ కు పర్మినెంట్ మిత్రులు, శత్రువులు ఎవరూ లేరంటూ రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పడం ద్వారా.. అమెరికాతో దోస్తీపై క్లారిటీ ఇచ్చారు. మన మంచిని కోరుకునే వారే మన దోస్త్ అన్న మెసేజ్ ను అమెరికాకు డైరెక్ట్ గా పంపిస్తున్నారు. మనపై పగ సాధించే వారు శత్రువు కిందే లెక్క అన్నట్లుగా ఢిల్లీ డీల్ చేస్తోంది. అసలు మనపై ట్రంప్ 50 శాతం టారిఫ్ లు వేయడం వెనుక రష్యన్ ఆయిల్ కొనడమే కారణం కాదట. భారత్ పాక్ ఉద్రిక్తతలు చెలరేగినప్పుడు మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ చెప్పుకోవడం.. అలాంటిదేమీ లేదని భారత్ చెప్పడంతో ఇగో హర్ట్ అయి 50 శాతం టారిఫ్ లు వేశారని, అమెరికన్ ఫైనాన్షియల్‌ సర్వీసెస్ కంపెనీ తన రిపోర్ట్ లో పేర్కొంది. ట్రంప్ వ్యక్తిగత కోపంతోనే మనపై టారిఫ్ లు బాదారని అమెరికన్లే చెబుతున్నారు. జాతీయ అత్యవసర చట్టాన్ని ప్రయోగించానని కవర్ చేసుకోవడం ఎందుకు? సుప్రీం కోర్టులో ట్రంప్ వాదన అసలు నిలబడుతుందా.. ఇవన్నీ కీలకంగా మారుతున్నాయి. భారత్‌కు అమెరికా నీతులు చెబుతుండటం.. ఏనుగును ఎలుక ఢీకొంటున్నట్లు ఉందని అమెరికా ఎకానమిస్ట్ రిచర్డ్‌ వోల్ఫ్‌ కామెంట్ చేశారు. సుంకాల వల్ల అమెరికాతో సంబంధాలు దెబ్బతింటే.. తన ఎగుమతులను ఇతర దేశాలకు అమ్మేందుకు భారత్‌ ప్రయత్నిస్తుందని, ఈ చర్య బ్రిక్స్‌ దేశాలను మరింత బలోపేతం చేస్తుందన్నారయన. ప్రపంచ ఉత్పత్తుల్లో చైనా, భారత్, రష్యాలతో పాటు బ్రిక్స్‌ దేశాల వాటా 35 శాతం. అదే జీ7 వాటా 28 శాతమే అని చెప్పుకొచ్చారు. సో ఓవరాల్ గా నష్టం అమెరికాకే అన్న వెర్షన్ ను వినిపిస్తున్నారు.

Also Read: దారుణం.. కుక్కకాటుతో నాలుగేళ్ల బాలుడు మృతి

ఈ టారిఫ్ ల గోల ఒకవైపు కొనసాగుతుంటే వైట్ హౌజ్ లో ట్రంప్ మిస్సింగ్ న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇటీవల ట్రంప్‌ మీడియా ముందుకురాలేదు. ఏం చెప్పాలనుకున్నా.. తన ట్రూత్‌ సోషల్ ద్వారానే టెక్ట్స్ రూపంలో పోస్టులు పెడుతున్నారు. వీకెండ్ లోనూ ఎలాంటి పబ్లిక్‌ ఈవెంట్లు వైట్‌హౌస్‌ షెడ్యూల్‌లో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. 79 ఏళ్ల ట్రంప్‌ అనారోగ్యంపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ట్రంప్‌ చేతిపై గాయంతో కనిపించారు. గతంలో ఈ గాయాన్ని దాచడానికి ఆయన చేతికి మేకప్‌ వేసుకొని బయటికొచ్చారు. దీనిపై ట్రంప్‌ డాక్టర్ సీన్‌ బార్బబెల్లా రియాక్ట్ అవుతూ ఆ గాయం నిజమేనని ఒప్పుకున్నారు. తరచుగా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం వల్ల, ఆస్ప్రిన్‌ వాడటంతో ఇలా జరిగిందన్నాడు. అటు ట్రంప్ అనారోగ్యంపై ఇంతలా డిబేట్ పెరుగుతుంటే.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కూడా రంగంలోకి దిగి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎలాంటి భయంకరమైన విషాదం చోటుచేసుకున్నా, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నాననడం కొత్త చర్చకు తెరలేపింది. అధ్యక్షుడు ట్రంప్‌ చాలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని, మిగిలిన పదవీకాలాన్ని ఆయన విజయవంతంగా పూర్తి చేస్తారని నమ్ముతున్నానని, ఒకవేళ అనుకోని పరిస్థితులు ఎదురైతే, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానంటూ వాన్స్ కామెంట్ చేశారు. సో అసలే అనారోగ్యం, ఇప్పుడు ఎడాపెడా టారిఫ్ లతో మరింత తలనొప్పులు.. అవసరమా ట్రంప్ అంటున్నారు అమెరికన్లు.

Story By Vidya Sagar, Bigtv

Related News

Modi To Jinping: జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ.. మరింత బలోపేతం, ఏనుగు-డ్రాగన్ ఒక్కటవ్వాలి

Modi Japan Tour: మోదీ జపాన్ పర్యటన ద్వారా భారత్ కి కలిగే లాభం ఇదే..

Trump Is Dead: ‘ట్రంప్ ఈజ్ డెడ్’ మోత మోగిపోతున్న సోషల్ మీడియా

Trump Tariffs: సుంకాలు చట్టవిరుద్ధం.. ట్రంప్‌కు దిమ్మతిరిగే దెబ్బ

Australia Support: డెడ్ ఎకానమీ కాదు, అద్భుత అవకాశాల గని.. భారత్ కి ఆస్ట్రేలియా బాసట

Big Stories

×