BigTV English

Mahesh Babu -Gautam: ఎంత పని చేశావు జక్కన్న.. నీ స్వార్థానికి వారి మధ్య దూరం పెంచావా?

Mahesh Babu -Gautam: ఎంత పని చేశావు జక్కన్న.. నీ స్వార్థానికి వారి మధ్య దూరం పెంచావా?

Mahesh Babu -Gautam: సాధారణంగా ఒక సినిమాను అనుకున్న సమయానికి కంప్లీట్ చేయాలంటే.. అటు నటీనటులు , ఇటు దర్శక నిర్మాతలు ఆ పనికి కట్టుబడి ఉండాల్సిందే. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో తప్పని పరిస్థితుల్లో వాటిని పక్కన పెట్టాల్సి ఉంటుంది కూడా.. అయితే ఇది మిగతా డైరెక్టర్ల విషయానికి వస్తే సాధ్యమవుతుంది. కానీ జక్కన్నతో సినిమా చేస్తున్నాము అంటే ఎంతటి పరిస్థితులనైనా సరే అధిగమించాల్సిందే.. తట్టుకోవాల్సిందే.. ముఖ్యంగా ఒక నటుడులోని మరో కోణాన్ని వెలికి తీయడంలో రాజమౌళి (Rajamouli ) తర్వాతే ఎవరైనా.. అలాంటి ఈయన ఇప్పుడు తన స్వార్థం కోసం తండ్రీ కొడుకుల మధ్య దూరాన్ని పెంచారు అనే వార్త వినిపిస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


కొడుకును తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మహేష్ బాబు..

రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheahbabu) తో ఎస్ఎస్ఎంబి 29 (SSMB 29)అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఇది ఆఫ్రికన్ అడవుల్లో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అటు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆఫ్రికాలోని కెన్యా ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్లో భాగంగా అక్కడ బిజీగా గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ రోజు మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని (Gautam Ghattamaneni)పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మొదటిసారి నీ బర్త్డేని మిస్ అవుతున్నాను. అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.


కొడుకు పుట్టినరోజు నాడు కొడుకును మిస్ అవుతున్న మహేష్..

మహేష్ బాబు తన కొడుకుతో దిగిన పాత ఫోటోని షేర్ చేస్తూ..” హ్యాపీ 19 మై సన్.. ప్రతి ఏడాది నువ్వు నన్ను ఇంకా ఎక్కువగా ఆశ్చర్యపరుస్తున్నావు. అయితే ఈ సంవత్సరం నేను నీ పుట్టిన రోజును చాలా మిస్ అవుతున్నాను. ఇన్నేళ్లలో నేను మిస్ అయ్యింది కూడా ఇదే. నీ ప్రతి అడుగులో కూడా నా ప్రేమ ఉంటుంది. నువ్వేం చేసినా సరే నేను నీకు అండగా ఉంటాను. నువ్వు ఇంకా ప్రకాశించాలి.. ఎదగాలి” అంటూ ఒక పోస్ట్ చేశారు మహేష్ బాబు. దీంతో ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇకపోతే మహేష్ బాబు కొడుకుకి 19 సంవత్సరాలు వచ్చాయని, రాజమౌళి షూటింగ్ వల్లే తాను మొదటిసారి తన కొడుకు పుట్టినరోజుకి దూరంగా ఉన్నానని మహేష్ బాబు తెలిపారు.

రాజమౌళి పై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు..

ఇది చూసిన అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంత పని చేశావు జక్కన్న.. నీ సినిమా స్వార్థం కోసం తండ్రీ కొడుకుల మధ్య దూరాన్ని పెంచావుగా అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం . మరి కొంతమంది జక్కన్న ఇన్ని కఠిన నియమాలు పెడతారు కాబట్టే సినిమా స్థాయి ఎల్లలు దాటింది అని ఆయనకు అండగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు మహేష్ బాబు తన కొడుకును తలచుకొని కొడుకు బర్తడే మిస్ అవుతున్నందుకు చాలా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మహేష్ బాబు అభిమానులు గౌతమ్ ఘట్టమనేని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. గౌతమ్ ఘట్టమనేని ప్రస్తుతం అమెరికాలో నటనలో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే.

also read:Ramayana: రామాయణ ఫస్ట్ పార్ట్ ముగింపు అక్కడే.. రంగంలోకి మెగాస్టార్!

Related News

Tamannaah Bhatia: మరోనటితో మాజీ ప్రియుడు విజయ్‌ వర్మ.. తమన్నా రియాక్షన్‌ చూశారా?

Mohan Sri Vathsa: తనను తాను చెప్పుతో కొట్టుకున్న టాలీవుడ్ డైరెక్టర్

Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ అదిరిపోయే అప్‌డేట్‌.. పవన్‌ లుక్‌ చూశారా.. ఇక మాస్‌ జాతరే..

The Paradise: గ్లోబల్ రేంజ్ లో నాని ది ప్యారడైజ్.. రంగంలోకి హాలీవుడ్?

Ghaati Pre Release: ఘాటీ ప్రమోషన్లకు అనుష్క అవసరం లేదు…  క్రిష్ షాకింగ్ కామెంట్స్!

Krish -HHVM: వీరమల్లు నుంచి అందుకే తప్పుకున్నా… ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన క్రిష్!

Big Stories

×