E-Paper
Advertisement

Apple Store launch in Mumbai : ఇండియాలో తొలి ఐఫోన్ రిటైల్ స్టోర్.. టిమ్ కుక్ ఫుల్ హ్యాపీ

Apple Store launch in Mumbai : ఇండియాలో తొలి ఐఫోన్ రిటైల్ స్టోర్.. టిమ్ కుక్ ఫుల్ హ్యాపీ
Advertisement
Apple Store launch in Mumbai

Apple Store launch in Mumbai :యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఫుల్ ఖుష్. ఇండియాలో ఆతిథ్యం చూసి పొంగిపోయాడు. తమ యాపిల్ కంపెనీ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ఆదాయం రావడంతో పాటు.. ఇండియాలో వచ్చే రెండేళ్లలో తమ సంస్థ లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందని చెప్పుకొచ్చాడు.

ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని రిలయన్స్‌ జియో వరల్డ్‌ డ్రైవ్‌ మాల్‌లో యాపిల్‌ ఫస్ట్ రిటైల్‌ స్టోర్‌ ఓపెన్ అయింది. ఈ స‍్టోర్‌ను యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ స్వయంగా ప్రారంభించారు. లాస్‌ఎంజెల్స్‌, న్యూయార్క్‌, బీజింగ్‌, మిలాన్‌, సింగ్‌పూర్‌ తర్వాత ముంబైలో ఏర్పాటు చేసిన యాపిల్‌ ఐ-ఫోన్‌ రిటైల్‌ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. టిమ్ కుక్‌ను చూసేందుకు, యాపిల్ ప్రొడక్ట్‌లను కొనుగోలు చేసేందుకు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు చెందిన యాపిల్‌ అభిమానులు స్టోర్‌ ఎదుట బారులు తీరారు. చాలా మంది సందర్శకులు స్టీవ్ జాబ్స్ ఇష్టపడేలా టీ-షర్టులను వేసుకుని వచ్చారు. జుట్టును యాపిల్ లోగో ఆకారంలో కత్తిరించుకొని అభిమానాన్ని చాటుకున్నారు. ఓ అభిమాని ఏకంగా 1984లో ప్రారంభించిన మొదటి యాపిల్ కంప్యూటర్ మాకింతోష్ కంప్యూటర్ తీసుకొచ్చాడు. ఇవన్నీ చూసిన టిమ్ కుక్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

Advertisement

మాధురి దీక్షిత్‌తో కలిసి వడా పావ్ లాగించాడు. ఆకాశ్ అంబానీని స్పెషల్‌గా మీట్ అయ్యారు. ఇదే సమయంలో భారత్‌లోని వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులు టిమ్ కుక్‌ను కలిశారు. 20వ తేదీ వరకు టిమ్ కుక్ ఇండియాలోనే ఉండబోతున్నారు. ఏప్రిల్ 20వ తేదీన ఢిల్లీలో రెండో యాపిల్‌ రిటైల్‌ స్టోర్‌ లాంఛ్‌ చేయనున్నారు.

మొత్తానికి యాపిల్ సీఈవో టిమ్ కుక్.. ఇండియా టూర్‌లో ఫుల్ బిజీగా, చాలా హ్యాపీగా గడుపుతున్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×