BigTV English

IT Raids: ‘పుష్ప’పై ఐటీ రైడ్స్.. 500 కోట్ల మనీలాండరింగ్? సుకుమార్ అంత సంపాదించారా?

IT Raids: ‘పుష్ప’పై ఐటీ రైడ్స్.. 500 కోట్ల మనీలాండరింగ్? సుకుమార్ అంత సంపాదించారా?
Sukumar-Mythri-Movie-Makers

IT Raids: పుష్ప అంటే సినిమా అనుకున్నారా.. కాదు, స్కాం.. అంటోంది ఇన్‌కమ్ ట్యాక్స్. పుష్ప మూవీ నిర్మాతలు, దర్శకుడిపై ఏకకాలంలో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాలు, దర్శకుడు సుకుమార్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ రవిశంకర్, నవీన్ ఇళ్లలో ఐటీ చెకింగ్స్ నడుస్తున్నాయి. ఐటీ దాడుల సమయంలో డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో లేరు. ఆయన పుష్ప షూటింగ్‌లో ఉన్నారు.


పక్కా సమాచారంతోనే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. పుష్ప 2 నిర్మాణం కోసం 500 కోట్లు విదేశాల నుంచి వచ్చాయని అనుమానిస్తున్నారు. ఆర్బీఐ పర్మిషన్ లేకుండా హవాలా పద్దతిలో ఈ సొమ్మంతా తరలించి.. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తోంది. సినిమా బడ్జెట్‌కు సంబంధించిన లావాదేవీల్లో తప్పులు జరిగినట్టు ఐటీ చెబుతోంది.

ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాల రిలీజ్ సమయంలోనూ మైత్రీ మూవీ మేకర్స్‌పై ఐటీ రైడ్స్ జరిగాయి. అప్పుడు చూపించిన లెక్కలకు.. ప్రస్తుత లెక్కలకు భారీ వ్యత్యాసం ఉన్నట్టు ఐటీ గుర్తించింది. ఆ అంశంపైనా ఆరా తీస్తోంది. ముఖ్యంగా 500 కోట్ల హవాలా మనీపైనే ఫోకస్ చేస్తోంది.


గతంలో లైగర్ సినిమా విషయంలోనూ ఇలానే హడావుడి జరిగింది. లైగర్‌కు 100 కోట్ల వరకూ విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయని.. వాటి వెనుక ఓ బడా పొలిటీషియన్ ఉన్నారంటూ ఈడీ అనుమానించింది. మనీలాండరింగ్‌పై పూరి జగన్నాథ్, చార్మిలను ప్రశ్నించింది కూడా.

మైత్రీ మూవీ మేకర్స్ వరుసగా స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీస్తోంది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీని కూడా నడుపుతోంది. 150 కోట్లతో పుష్పను నిర్మించగా… దాదాపు 300 కోట్ల వసూళ్లు వచ్చినట్టు టాక్. అటు, సుకుమార్‌ సైతం పలు చిత్రాలకు నిర్మాతగా ఉన్నారు. 2019లో 8 కోట్లు పెట్టి మూడు అంతస్తుల విల్లా కొనుగోలు చేశారు. 11 కోట్లతో ఇంటీరియర్ డిజైనింగ్, 5 కోట్లతో ఇటాలియన్ మార్బల్, ఫర్నీచర్‌ చేయించారు. సుకుమార్ అకౌంట్ స్టేట్‌మెంట్స్‌, క్రాస్ చెక్ చేస్తున్నారు ఐటీ అధికారులు. పుష్ప1, 2 రెండు సిరీస్‌లకు గానూ సుకుమార్ 60 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. ఇక రంగస్థలానికి 25కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని అంటున్నారు. అయితే పారితోషికంలో కేవలం 10శాతం మాత్రమే లెక్కలో చూపించినట్టు ఐటీ భావిస్తోంది. ఆ వివరాలు కూపీ లాగుతున్నారు అధికారులు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×