BigTV English
Advertisement

Prasadam:-ప్రసాదం తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా…

Prasadam:-ప్రసాదం తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా…

Prasadam:- ఆలయాలకు వెళ్తాము కానీ అక్కడ ఇచ్చే దేవుడి ప్రసాదాలను ఎలా తినాలో చాలా మందికి తెలియదు. శివాలయంలో బిల్వ తీర్థం ఇస్తే , వెంకటేశ్వరస్వామి గుడిలో తులసిదళం తీర్థం ఇస్తారు.కొంతమంది చేతిలో తీసుకుంటారు .ఇంకొంతమంది వేరొకరి చేతి నుండి వారి చేతుల్లోకి ఒంపుకుంటారు . అలాగే గుడిలో చక్కరపొంగళి పులిహోర లాంటివి ఇచ్చినప్పుడు కూడా తినేప్పుడు పొరపాట్లు ఎన్నో జరుగుతుంటాయి . తీర్థం తీసుకోవాలి అంటే ఎడమచేతి పైన కుడిచేతిని పెట్టి తీర్థం తీసుకుని రెండు కళ్ళకు మొక్కుకుని ఆ తరువాత తాగాలి. తర్వాత అరచేతిని తలపైన తుడుచుకోవడం చేయకూడదు. రెండు చేతులలోకి తుడుచుకుంటే సరిపోతుంది.


మహిళలు తీర్థం ప్రసాదం గుడిలో తీసుకునేప్పుడు వారి పైట కొంగును చేతులతో పట్టుకుని ,పూలు అయితే పైట కొంగులోనే తీసుకోవాలి .అలాగే చక్కర పొంగలి లాంటివి ఇచ్చినప్పుడు కుడిచేత్తో తీసుకుని అలాగే నోట్లో వేసుకుంటారు కొందరు . పక్షులకు చేతులు లేవు కనుక అవి అలా తింటాయి , మనకు దేవుడు రెండు చేతులు ఇచ్చాడు. కనుక చక్కగా కుడి చేత్తో ప్రసాదాన్ని తీసుకుని ఎడమచేతిలోకి మార్చుకుని కుడిచేత్తో కొద్దికొద్దిగా తీసుకుని తినాలి. అలా కాకుండా కుడిచేతిలోకి తీసుకుని ఒకేసారి నోటితో తీసుకుంటే మరుజన్మలో పక్షులై పుడతారని చెబుతారు. మన అరచేతిలో ముక్కోటి దేవతలు నివాసం ఉంటారు. అందుకే ఉదయం నిద్ర లేవగానే అరచేతిని మొదటగా చూడమని మన పెద్దలు చెప్పారు అదే శాస్త్రం కూడా చెబుతోంది.

భగవద్ ప్రసాదం స్వీకరించేటప్పుడు చేతులు నోటికి ఎందుకు తగలకూడదు. ప్రసాదం నేరుగా నోట్లో వేసుకోవాలని చాలా చోట్ల చెబుతారు. ఇది కేవలం శ్రీ వైష్ణవ అలయాలలో , మఠాలలో, ఇళ్లలో మాత్రమే చూస్తాం. చేయి నోటికి తగిలితే ఆ చేయి మళ్ళీ పాత్రలో ఉండే ప్రసాదాన్ని తాకితే అది…భగవద్ శేషం కాకుండా ” మన శేషం గా మారిపోతుంది.ఆ తరువాత తీసుకునేదంతా మన శేష ప్రసాదమే..ఎన్నో హేయ గుణాలు కలిగిన వారం అవ్వడం వల్ల మనం ముందు స్వీకరించిన ప్రసాదం కూడా ఏ ప్రభావము చూపకుండా, నిష్ప్రయోజనంగా మారుతుంది.


లవ్ బర్డ్స్ ను ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి…

for more updates follow this link:-bigtv

Related News

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Big Stories

×