E-Paper
Advertisement

Banana : అరటిపండ్లు తింటే గుండెపోటు రాదా?

Banana : అరటిపండ్లు తింటే గుండెపోటు రాదా?
Advertisement

Banana : ప్రతిరోజు మూడు అరటిపండ్లను తినడం వల్ల గుండెపోటుకు చెక్‌పెట్టవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు ఓ అధ్యయనంలో కూడా ఇది నిరూపితం అయింది. నిత్యం కేవలం మూడు అరటి పండ్లను తినడం వల్ల హార్ట్ ఎటాక్‌తో పాటు, గుండెజబ్బులు కూడా దరిచేరవని అంటున్నారు. ఉదయం అల్పాహారం సమయంలో ఒకటి, మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకటి, రాత్రి భోజనం చేసేప్పుడు మరొక అరటిపండు తింటే తీసుకుంటే శరీరంలో పొటాషియం స్థాయిలు సరిగ్గా ఉంటాయని చెబుతున్నారు. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయట. అంతేకాకుండా రక్త సరఫరా కూడా మెరుగు అవుతుందని అంటున్నారు. మరోవైపు మెదడు, రక్త సంబంధిత రోగాలను కూడా 21 శాతం తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నట్స్‌, పాలు, చేపలను కూడా నిత్యం ఆహారంలో తీసుకుంటే కూడా గుండెపోటు, రక్తపోటు రావని అంటున్నారు. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను నిత్యం తీసుకుంటే గుండె జబ్బులు రావని తేల్చిచెబుతున్నారు.ఒకవేళ గుండెజబ్బులు వచ్చినా జాగ్రత్తగా ఉండేందుకు పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగని పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువ మోతాదులో తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×