E-Paper
Advertisement

Bangkok : బ్యాంకాక్ లో బ్రహ్మదేవుడి సెంటిమెంట్

Bangkok : బ్యాంకాక్ లో బ్రహ్మదేవుడి సెంటిమెంట్
Advertisement

Bangkok : థాయ్ లాండ్ అంటే బీచ్ లు, రిసార్టులు, మసాజ్ లు , షాపింగులే కాదు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అవే ఆలయాలు కూడా టూరిజంలో భాగమే. బ్రహ్మదేవునికి పూజలందుకోరాదన్న శాపం ఉందంటారు. అందుకనే మన దేశంలో బ్రహ్మదేవుని ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఉన్న ఒకటీ అరా బ్రహ్మదేవుని ఆలయాలు గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటాం. అలాంటిది ఎక్కడో థాయ్‌లాండ్‌లో ఓ బ్రహ్మదేవుని ఆలయం ఉంది. స్వయంగా థాయ్ ప్రజలే బ్రహ్మకు ప్రత్యేక ఆలయం కట్టడంతోపాటు నిత్యం పూజలు అందిస్తారు. లక్ష్మీ, ఇంద్రుడు, నారాయణుడు, వినాయకుడు, త్రిమూర్తుల విగ్రహాలను కూడా ఆలయ సమీపంలో ప్రతిష్టంచారు

బ్రహ్మదేవుడ్ని ప్రా ప్రోం పేరుతో పిలుస్తుంటారు. పరబ్రహ్మ అంటే థాయ్‌ ప్రజలకు చాలా గౌరవం. ఎక్కువగా మంది బుద్దిజంను నమ్మినా బుద్ధునితో పాటుగా ఇలా పరబ్రహ్మ వంటి దేవతలను కూడా పూజిస్తుంటారు. ప్రా ప్రోంను పూజిస్తే సకల శుభాలూ కలుగుతాయనీ, సమస్యలన్నీ తీరిపోతాయని థాయ్‌వాసుల విశ్వాసం. థాయ్‌లాండ్‌లో బ్రహ్మదేవుని ఆరాధన బౌద్ధుల ఆచారాలని గుర్తుకు తెస్తుంది. విగ్రహం ముందు ధూపం వేయడం, కొవ్వొత్తులు వెలిగించడం, కొబ్బరి పాలని నైవేద్యంగా అర్పించడం కనిపిస్తుంటుంది.

Advertisement

బ్రహ్మదేవుని ముందు ఏనుగు బొమ్మని పెడితే కోరుకున్న కోరిక నెరవేరుతుందన్న విశ్వాసమూ ఉందిథాయ్‌లాండ్‌లో బుద్ధ విగ్రహాలు, దేవాలయాలు అక్కడక్కడా దర్శనమిస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనది థాయ్‌ రాజధాని బ్యాంకాక్‌లోని ఎరావన్ ఆలయం. పరబ్రహ్మకి సంగీతం అంటే ఇష్టమన్నది అక్కడ ప్రజల విశ్వాసం. అందుకే బ్రహ్మదేవుడి ఎదుట థాయ్‌ సంగీతంతో కూడిన సంప్రదాయ నాట్యం చేస్తుంటారు. ఎరావన్ ఆలయానికి ఎన్ని అవాతరాలు ఎదురైనా… అక్కడి బ్రహ్మదేవుని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల వెల్లువలో ఏమాత్రం మార్పు రాలేదు. జీవితంలో ఎలాంటి సమస్యనైనా బ్రహ్మదేవుడు తీరు స్తాడని థాయ్‌ ప్రజలు బలంగా నమ్ముతుంటారు

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×