Big Stories

Coffee Side Effects : ఖాళీ కడుపుతో కాఫీ తాగితే..!

Coffee Side Effects

Coffee Side Effects (health news today):

- Advertisement -

ఉదయాన్నే నిద్ర లేవగానే అమ్మా కాఫీ అంటుంటారు చాలా మంది. మరి కొందరికైతే పొద్దు పొద్దున్నే టీ కడుపులో పడితే గాని రోజు మొదలవ్వదు. ఆ కాఫీ లేదా టీ పై నుంచి వచ్చే చిన్నపాటి పొగలు, ఆ స్మెల్ అబ్బా.. ఎంత హాయిగా ఉంటుందో కదా.. అలానే స్నేహితులు వచ్చినా లేదా వేరే అథిదుల వచ్చినా ఒక కప్పు టీ, కాఫీ అందించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఉదయాన్నే పరగడుపున కాఫీ, టీ తాగడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

- Advertisement -

ఉదయం పూట కడుపు ఖాళీగా, ఫ్రెష్‌గా ఉంటుంది. ఆ సమయంలో టీ, కాఫీని తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఉదయాన్నే టీ లేదా కాఫీ తీసుకుంటే వాటిలో ఉండే కెఫిన్ వల్ల ఎసిడిటీ పెరుగుతుంది. ఫలితంగా కడుపులో అల్సర్లు వస్తాయి. గుండెల్లో మంట కూడా వస్తుంది. కెఫిన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీని కారణంగా చికాకు కలుగుతుంది. అలానే జీర్ణక్రియ అసౌకర్యానికి గురవుతుంది.

కాఫీలో ఆమ్లత్వం అధికంగా ఉంటుంది. అందువల్ల ఆందోళన, ఒత్తిడి, పొట్ట ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కెఫిన్ మన శరీరంలో మూత్రం తయారీని ఎక్కువగా చేస్తుంది. దీనివల్ల మూత్ర విసర్జన అధికంగా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల డీహైడ్రేషన్‌కు గురి అవుతారు. అంతే కాకుండా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ తర్వాత టీ, కాఫీలు తాగడం బెటర్. దీని వల్ల ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News