Root : సాధారణంగా యాషెస్ సిరీస్ కి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దాదాపు 141 సంవత్సరాల చరిత్ర గల ఈ సిరీస్ లో మరోసారి ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఈ సారి యాషెస్ సిరీస్ 2025 నవంబర్ నుంచి జనవరి 08, 2026 వరకు జరుగుతుంది. అ ప్రతిష్టాత్మక సిరీస్ కి ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది. ఈ సిరీస్ ప్రారంభానికి రెండు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ మాజీ క్రికెటర్లు మాత్రం తమ సవాల్ తో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాసెస్ టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ ప్లేయర్ రూట్ ఆస్ట్రేలియా లో తొలి సెంచరీ నమోదు చేస్తాడని హెడెన్ పేర్కొన్నారు.
Also Read : Gill-Fatima : ఈ హీరోయిన్ తో కూడా గిల్ కు రిలేషన్..?
ఒక వేళ రూట్ సెంచరీ చేయకపోతే తాను మెల్ బోర్న్ గ్రౌండ్ లో నగ్నంగా నడుస్తానని చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దీనిపై నెటిజన్లు ఫన్నీ పోస్టులు చేస్తున్నారు. ఈ బోల్డ్ ఛాలెంజ్ పై హెడెన్ కుమార్తె, క్రికెట్ ప్రెజెంటర్ గ్రేస్ హెడెన్ స్పందించింది. ప్లీజ్ రూట్ ఒక్క సెంచరీ చేయండి.. లేదంటే మా నాన్న అన్నంత పని చేస్తాడుష రాసుకొచ్చింది గ్రేస్. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్న జో రూట్.. ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డ పై ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఏ ఫార్మాట్ లో కూడా రూట్ సెంచరీ మార్క్ ను అందుకోలేకపోయాడంటే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒక మ్యాచ్ లో సెంచరీ చేస్తాడని భావించినప్పటికీ 91 పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో ఆ మ్యాచ్ లో రూట్ సెంచరీ చేయలేకపోయాడు.
Also Read : IND vs PAK Asia Cup 2025: టీమిండియాతో మ్యాచ్.. పాకిస్తాన్ కోచ్ సంచలన వ్యాఖ్యలు.. ఐదుగురితో నరకం చూపిస్తాం!
ఆస్ట్రేలియా రూట్ ఇప్పటివరకు 14 టెస్ట్ మ్యాచ్ లు, 16 వన్డేలు, మూడు టీ-20లు ఆడాడు. ఆసీస్ లో మూడు ఫార్మాట్లలో కలిపి రూట్ 9హాఫ్ సెంచరీలు చేసాడు. అతని అత్యధిక స్కోర్ 91 నాటౌట్ గా ఉంది. అయితే ఓవరాల్ గా ఆసీస్ పై రూట్ కి మంచి రికార్డు ఉంది. రూట్ తన కెరీర్ లో నాలుగు సెంచరీలు చేసాడు. అవన్నీ కూడా స్వదేవంలో చేసినవే కావడం గమనార్హం. కానీ ఆస్ట్రేలియా గడ్డపై ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అందుకే హెడెన్ అలాంటి సంచలన కామెంట్స్ చేశాడు. మరోవైపు ప్రస్తుతం రూట్ చాలా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి కచ్చితంగా చేస్తారని నెటిజన్లు పేర్కొంటున్నారు. రూట్ సెంచరీ చేస్తాడో లేదో వేచి చూడాలి మరీ.