Nagpur News: మహారాష్ట్ర, నాగ్ పూర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాగ్ పూర్ రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి రైలు బోగీపై నిలబడి కరెంట్ వైర్ ను తాకడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యక్తి విద్యుత్ షాక్ కు గురై స్పాట్ లో మృతిచెందాడు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ దృశ్యాన్ని ప్రయాణికులు మొబైల్ లో వీడియో తీశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ యువకుడు నాగ్ పూర్ రైల్వే స్టేషన్ కు వచ్చాడు. అతడికి ఏమైందో ఏమో కానీ.. రైలు బోగీపైకి ఎక్కాడు. అప్పటికి స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు యువకుడి గమనిస్తూనే ఉన్నారు. ప్లాట్ ఫారమ్ పై ఉన్న ప్రయాణికులు అతడిని కిందకు దిగమని కేకలు వేశారు. చనిపోవద్దు.. అని అందరూ గట్టిగా అరిచారు. అయినప్పటికీ ఆ యువకుడు ఎవరి మాటలు వినకుండా రైలు బోగీ పై నిలబడి విద్యుత్ తీగలను తాకేందుక ప్రయత్నించాడు. అయితే, ఒక్కసారిగా అతని శరీరం భాగం రైలుకు విద్యుత్ సరఫరా చేసే ఓవర్‌హెడ్ అధిక వోల్టేజ్ తీగను తాకింది. వెంటనే ఒక ప్రకాశవంతమైన అగ్ని మెరుపు కనిపనించింది. ఆ వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై అక్కడే స్తంభించిపోయి, ప్లాట్‌ఫారమ్‌పై పడి స్పాట్ లో మృతిచెందాడు. ఈ ఘటన అక్కడ ఉన్నవారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ALSO READ: Heavy rain: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
అధికారులు ఈ ఘటన గురించి విచారణ జరుపుతున్నారు. కానీ ఆ వ్యక్తి మానసికంగా అస్థిరంగా ఉన్నాడా..? లేక సోషల్ మీడియా కోసం రీల్ తీయడానికి ఈ ప్రమాదకర చర్యకు పాల్పడ్డాడా..? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. సోషల్ మీడియా కోసం లైక్‌లు, వీక్షణల కోసం చేసే ఇటువంటి ప్రమాదకర చర్యలు తరచూ ప్రాణాంతకంగా ముగుస్తున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన యువతకు, ముఖ్యంగా సోషల్ మీడియా కోసం ప్రమాదకర స్టంట్‌లకు పాల్పడే వారికి ఒక హెచ్చరికగా నిలుస్తుంది. విద్యుత్ తీగల సమీపంలో ఇటువంటి చర్యలు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టం చేస్తుంది.
ALSO READ: Hyderabad Metro: ఈ మెట్రోను మేము నడపలేం.. సమస్యను పరిష్కరించండి బాబోయ్..