Nainika Anasuru : ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు పర్సనల్ గా కూడా ఉంటుంది. అవి బయటపడిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు మాత్రం ఎక్కువగా సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి, ఏ విషయం జరిగినా కూడా క్షణాల్లో బయటకు వస్తుంది.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే ప్రాబ్లం ఉంది అని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. చాలామంది రోడ్లు ఎక్కిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది కాస్టింగ్ కౌచ్ ఉండదు అంటారు. ఇంకొంతమంది ఖచ్చితంగా ఉంటుంది అంటారు. ఇదే విషయం పైన రీసెంట్ గా ఇచ్చిన ఒక పాడ్ కాస్ట్ లో నైనిక ఓపెన్ అయ్యారు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ మీరు ఫేస్ చేశారా అని బిగ్ టీవీ కిస్సిక్ టాక్ షోలో అడిగినప్పుడు. నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను. కొంతమంది బాగా నన్ను కాస్టింగ్ కౌచ్ కోసం ప్రేరేపించారు. కొన్ని రోజుల తర్వాత నాకు ఒకరు ఒక విషయం చెప్పారు. మీ గురించి కొందరు ఇలా మాట్లాడుతున్నారండి… మీ ఫొటోస్ తో పాటు కింద రేటు కూడా మెన్షన్ చేసి మీ గురించి బయట సర్కులేట్ అవుతుందని అని నాకు చెప్పారు. అంటూ ఈ షోలో నైనిక తెలిపారు.
ఇండస్ట్రీ అంటే మంచి గుర్తింపు వస్తుంది. మంచి డబ్బులు వస్తాయి. అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అటువంటి ఇండస్ట్రీలో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఫేస్ చేసిన వాళ్లకి మాత్రమే ఇండస్ట్రీలోని అసలైన పరిస్థితిలో అర్థమవుతాయి. బహుశా కాస్టింగ్ కౌచ్ ను విపరీతంగా ఫేస్ చేయడం వలనే నైనిక ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నిజంగా తనకంటూ ఒక కూతురు ఉండి ఉంటే ఫిలిం ఇండస్ట్రీకి పంపించను. ఆర్టిస్ట్ ఫీల్డ్ వద్దు అంటాను అంటూ తెలిపారు.
Also Read: Bigg Boss Buzzz : కంటెస్టెంట్స్ లెక్కలు తేల్చనున్న మంగపతి, శివాజీ గ్రాండ్ ఎంట్రీ