Bigg Boss 9 : బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో కి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. గత ఎనిమిది సీజన్లు కంటే కూడా ఈ సీజన్ ఇంకొంచెం ఆసక్తికరంగా ఉంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా కామనర్స్ కి మరియు సెలబ్రిటీస్ కి మధ్య జరుగుతున్న కొన్ని పరిణామాలు మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వీటన్నిటిని మించి బిగ్ బాస్ ప్లాన్ కూడా అదిరిపోయింది. ఎవరు ఊహించని విధంగా సంజనాను కెప్టెన్ చేయడం అనేది పోకిరి లెవెల్ ట్విస్ట్.
మొదట కన్ఫెక్షన్ హౌస్ కి బిగ్ బాస్ సంజనా ను పిలిచి మాట్లాడటం. ఆ తర్వాత కెప్టెన్సీ టాపిక్ తీసుకురావడం. దానికోసం ఒక టాస్క్. కంటెండర్స్ సపోటర్స్ అంటూ టాస్క్ డిజైన్ చేసి ఒక కామనర్ తో సెలబ్రిటీ కెప్టెన్ అయ్యేలా ప్లాన్ చేశారు బిగ్ బాస్. మామూలుగా కామనర్ గెలిస్తే కామనర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సెలబ్రిటీస్ గెలిస్తే సెలబ్రిటీస్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఈ గేమ్ లో డిఫరెన్స్ ఏంటండీ కెప్టెన్ గా సంజనను గెలిపించింది కామనర్ అయిన దమ్ము శ్రీజ. తాను గేమ్ ఆడుతున్న అనుకుంది కానీ తన గ్రూప్ ఓడిపోతుంది అనుకోలేదు. మొత్తానికి సంజనను తన టాస్క్ కెప్టెన్ చేసేసింది.
ఈ సీజన్లో గొడవలన్నీ కూడా ఫుడ్ కోసమే జరుగుతున్నాయి. అడిగింది పెట్టట్లేదు అని ఒకరు. అనుకున్న టెస్ట్ రావట్లేదని మరొకరు. గుడ్డు పోయింది అని ఇంకొకరు ఇలా జరుగుతూనే ఉన్నాయి. అయితే సంజన కొన్ని తంసప్ బాటిల్స్ పట్టుకొచ్చి అందరినీ ఊరించింది. అయితే ఎవరికీ తెలియకుండా ఒక తంసప్ బాటిల్ను హరీష్ దొంగలించారు. ఈ విషయం ప్రియా శెట్టి కు, ఫ్లోరా సైనికు తెలుసు.
ప్రముఖ రియాల్టీ షో బతుకు జట్క బండి షో ను. ఫన్నీగా సెటైరికల్ గా రీ క్రియేట్ చేశారు. దీనిలో బాగా పర్ఫామెన్స్ చేసిన వాళ్ళకి ఈ తంసప్ ఇస్తాను అని కెప్టెన్ సంజన అనౌన్స్ చేశారు. అందులో భాగంగా భరణి (Bigg Boss Bharani) ఇమ్మానుయేల్ (Bigg Boss Immanuel) తనూజ, (Bigg Boss Tanuja) దమ్ము శ్రీజ (Dhammu srija) వీళ్లను సెలెక్ట్ చేశారు. అయితే పొద్దున్న దొంగలించిన తంసప్ ఇచ్చేయండి అంటూ క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చింది సంజన.
మొదటి రోజు నుంచి బిగ్ బాస్ లో చాలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు మాత్రం ఎటువంటి గొడవలు లేకుండా నవ్వుకుందాం అంటూ సంజన ఈ స్కిట్ కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టింది. అలా ఎక్కువగా నవ్వడం వలన ఆ ఫన్ లో అయినా తంసప్ ను ఎవరు తీశారు చెబుతారు అనే ఉద్దేశంతో ఆ స్కిట్ క్రియేట్ చేసినట్లు తెలిపింది.
బిగ్ బాస్ షోలో హరీష్ కిచెన్ లో ఎంటర్ అయిపోయి వెజ్ ఫ్రైడ్ రైస్ ను తనకోసం చేసుకొని తిన్నాడు. తింటున్న సమయంలో బిగ్ బాస్ అలా హరీష్ తినడం వలన మీకు ఏమీ ప్రాబ్లం లేదా అని కెప్టెన్ సంజనను అడిగారు. అలా అడగడంతోనే హరీష్ సగం ప్లేట్ ని తీసుకెళ్లి కిచెన్లో పెట్టేసాడు. నా వలన మీరు రిస్క్ లో పడొద్దు అంటూ సంజనకు చెప్పారు. కానీ దానికంటే ముందు తంసప్ ని దొంగలించింది కూడా హరీష్ అనేది మరో ట్విస్ట్. ఇకపై కెప్టెన్ అన్ని జాగ్రత్తగా చూసుకుంటాను ఒక అవకాశం ఇవ్వండి అంటూ బిగ్ బాస్ ని అడిగారు. చాక్లెట్ దొంగతనాలు, తంసప్ దొంగతనాలు, కొద్దిసేపటి ఫన్ స్కిట్స్ తో నేటి ఎపిసోడ్ పూర్తయింది.
Also Read : Bigg Boss Buzzz : కంటెస్టెంట్స్ లెక్కలు తేల్చనున్న మంగపతి, శివాజీ గ్రాండ్ ఎంట్రీ