Nainika Anasuru : ఎన్నో ఆప్షన్స్ ఉన్నా కూడా చాలామంది తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకోవాలి అనే తపనతో ఉంటారు. అలాంటి తపన ఉన్నవాళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా విపరీతమైన ఫాలోయింగ్ సాధించిన వాళ్ళు ఉన్నారు. ఎవరు అవకాశాలు ఇవ్వకపోయినా వాళ్లకు వాళ్లే టాలెంట్ చూపించే పరిస్థితి ఈ రోజు నెలకొంది.
ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ను గట్టిగా నమ్ముకుంటే అది మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. అలానే టీవీ ఇండస్ట్రీలో కూడా చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. డి అనే డాన్స్ షో తో విపరీతమైన గుర్తింపు సాధించుకుంది నైనిక. నైనికా రీసెంట్గా బిగ్ టీవీ కిస్సిక్ టాక్ షోకు హాజరైంది. ఆ షో లో అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది.
చాలామంది తమ పైకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. మా ఫ్యామిలీ ఎంకరేజ్ చేయడం వలన నేను ఈ స్థితికి వచ్చాను అని అంటుంటారు. ముఖ్యంగా చాలామందికి పేరెంట్ సపోర్ట్ ఉంటుంది. అయితే నైనిక పలు సందర్భాలలో వాళ్ల ఫ్యామిలీ గురించి చెబుతూ వచ్చింది. ఎప్పుడూ కూడా వాళ్ళ అమ్మ గురించి మాట్లాడింది తప్ప వాళ్ళ నాన్న గురించి ఏరోజు మాట్లాడలేదు.
మొదటిసారి కిస్సిక్ టాక్ షోలో వాళ్ల నాన్న రియల్ క్యారెక్టర్ బయటపెట్టింది. ఆయనకా మాట్లాడుతూ.. “మా నాన్న మాతో కలిసి ఉండరు, ఆయన గుడ్ పర్సన్ కాదు. మా అమ్మని ఎప్పుడూ కొడుతూ ఉండేవాళ్ళు. మా మదర్ ని బాగా టార్చర్ చేశారు. నాకు అమ్మంటే ఇష్టం కాబట్టి నేను నాన్నని పక్కన పెట్టేసాను. మా ఫ్యామిలీకి మీరు అవసరం లేదు వెళ్లిపోండి అని చెప్పేసాను. అంటూ నైనిక ఈ షోలో తెలియజేశారు.