వందేభారత్ రైళ్ల విషయంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రాకపోకలు కొనసాగిస్తున్న నాలుగు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ఆపరేషనల్ డేస్ ను సవరించింది. రైల్వే బోర్డు ఆమోదం తర్వాత దక్షిణ మధ్య రైల్వే (SCR) నాలుగు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ఆపరేషన్ రోజులలో మార్పులను ప్రకటించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 4, 5 నుంచి అమలులోకి వచ్చేలా కాచిగూడ-యశ్వంత్‌పూర్ రైళ్లు ఇప్పుడు శుక్రవారాల్లో, సికింద్రాబాద్-విశాఖపట్నం రైళ్లు సోమవారాల్లో రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, టైమింగ్స్, స్టాప్‌లు మారవని వెల్లడించింది.
తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే సవరించిన షెడ్యూల్ ప్రకారం, కాచిగూడ–యశ్వంత్‌పూర్–కాచిగూడ (రైలు నంబర్లు 20703/20704) రైళ్ల రాకపోకల విషయంలో కీలక మార్పులు చేశారు. డిసెంబర్ 4, 2025 నుంచి కొత్త మార్పులు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైళ్లు ఇకపై బుధవారం కాకుండా శుక్రవారాల్లో రద్దు చేయబడుతుందని వెల్లడించింది.
Read Also: ఇండియాలో వందే భారత్ రైళ్లే బాగా స్పీడ్ అనుకుంటిరా? కాదు.. ఈ రైలే అత్యంత స్పీడ్!
అటు సికింద్రాబాద్–విశాఖపట్నం–సికింద్రాబాద్ (రైలు నంబర్లు 20707/20708) రైళ్ల రాకపోకలు డిసెంబర్ 5 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇకపై గురువారం కాకుండా సోమవారాల్లో ఈ రైలు అందుబాటులో ఉండదని వెల్లడించింది. ఈ రైళ్ల స్టాప్‌లు, సమయాలు, ఫ్రీక్వెన్సీ మారలేదని SCR స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక ప్రకటన జారీ చేసింది.
Read Also: ఆరేళ్ల తర్వాత మళ్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ ఎంట్రీ, ఏ రూట్ లో అందుబాటులోకి వస్తుందంటే?