BigTV English

Vishnu Sahasranama : విష్ణు సహస్రనామ స్మరణతో కలిగే లాభాలు

Vishnu Sahasranama : విష్ణు సహస్రనామ స్మరణతో కలిగే లాభాలు
Vishnu Sahasranama

Vishnu Sahasranama : రోజుకు కనీసం ఒక్క సారైనా విష్ణుసహస్ర నామ పారాయణం చేస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ చేసిన అశ్వ మేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది. పాపాలు తొలగి ఆయురారోగ్యము కలుగుతాయి. స్తోత్రము లో ప్రతి నామము అద్భుతం. మన నిత్య జీవితంలోని అన్నీ సమస్యలకు పరిష్కరాలు ఇందులో వున్నాయి


భారత యుద్ధం జరిగిన తర్వాత శ్రీకృష్ణుడితో కలిసి అంపశయ్యపై ఉన్న భీష్మాచార్యుని
దగ్గరకు వెళ్తాడు ధర్మరాజు. మహాభారత యుద్ధానికి దుర్యోధనుడు ఎంత కారణమో, తాను అంతే కారణమని రాజ్యంతే నరకం ధ్రువమ్ అని రాజ్యపాలన చేసిన వాళ్లు ఎంతటి వాళ్లకైనా నరకం తప్పదన్న శాస్త్రవచనం, ధర్మజుని మనసులో మెదిలింది. తాను ఆ సిద్ధాంతం నుంచి తప్పించుకోవాలని, ధర్మతత్వాన్ని భీష్ముని ద్వారా
తెలుసుకోవాలని తాతను ఆశ్రయిస్తాడు

మానవుడు తరించడానికి గీతాశాస్త్రం, సహస్రనామం రెండే మార్గాలని బోధించాడు భీష్ముడు. ఈ మహా సంగ్రామం పాప పంకిలం నుంచి తప్పించుకోవాలని భావించిన
ధర్మరాజుకు భీష్ముడు ఎన్నో విషయాలు చెప్పాడు. అందులో సహస్రనామం కూడా ఒకటి. అనుశాసనిక పర్వంలో ఇది పేర్కొన్నాడు. భగవద్గీత, విష్ణు సహస్రనామం రెండూ భారతంలోని చివరి పర్వంలో చెప్పారు..


దుర్యోధనుడు తొమ్మిదవ పర్వంలో మరణిస్తే ఇంకా 9 పర్వాలు మిగిలి ఉండటం వెనుక గొప్ప అంతరార్థం ఉంది. కేవలం దుర్యోధనుని మరణంతో భారతం ముగిసిపోలేదు. యుద్ధం తర్వాత మానవుడు తరించడానికి చెప్పిన గొప్ప విషయాల్లో శ్రీవిష్ణు సహస్ర నామం ఒకటి.

విష్ణు సహస్రనామాలను చదివేటప్పుడు దేన్నో ఆశించి ఈ పని అసలు చేయకూడదు. అయితే కొంతమంది తప్పులు లేకుండా చదవడం కష్టం. మరి వాళ్ల సంగతేంటి..అంటే.. దేవుడ్ని ఎలా పిలిచినా పలుకుతాడు. భక్తితో
దేవుడ్ని కొలిచేదే ముఖ్యం. అంతేగాని రాగాలు, దోషాలు కాదు. సహస్రనామాలు
చదవలేనివాళ్లు, కృష్ణా, రామ ఇలా చిన్న చిన్న పదాలతో నామస్మరణం చేసినా ఫలితం ఉంటుంది. భవవంతుని వెయ్యి నామానాలతో దేవుడి ప్రీతి. మనం వాటిని చదవడం వల్ల ఒక ఎనర్జీ పుట్టుకొస్తుంది. అది మనకే కాదు మన చుట్టూ వాతావరణానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

ఓం నమో నారాయణాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×