E-Paper
Advertisement

karthika Masam : కార్తీక మాసంలో శుభకార్యాలు ఆచరించవచ్చా…?

karthika Masam : కార్తీక మాసంలో శుభకార్యాలు ఆచరించవచ్చా…?
Advertisement

karthika Masam : మీన రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు చైత్రమాసంలో శుభకార్యాలు నిర్వహించరాదు పండితులు చెబుతున్నారు. సూర్యుడు ధనురాశిలో ఉన్నప్పుడు పుష్య మాసం వస్తుంది కాబట్టి అప్పుడు కూడా శుభకార్యాలు తగదు. మిథున ఆషాడం అంటే సూర్యుడు మిధునరాశిలో ఉన్నప్పుడు ఆషాఢ మాసం వస్తుంది. ఆ మాసం కూడా శుభకార్యాలు నిర్వహించకూడదు..

కన్యా బాధ్రపదం అంటే కన్యారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు బాధ్రపద మాసం వస్తుంది. అప్పుడు కూడా శుభకార్యాలకు తగినది కాదు. ఆషాఢ శుద్ద ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్యమాసకాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగ నిద్రలో ఉండి కార్తీక శుద్ద ఏకాదశి నాడు నాలుగు నెలల నిద్ర అనంతరం మేలు కోవడంతో చాతుర్మాస ముగిసిపోతుంది. కాబట్టి కార్తీక మాసంలో శుభకార్యాలు చేయకూడదన్న వాదనలో నిజం లేదని పండితులు చెబుతున్నారు.

Advertisement

అప్పటి నుంచి ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి ఎంతో అనువైన మాసం అని చెప్పవచ్చు.ఈ మాసంలోనే సాక్షాత్తు లక్ష్మీదేవి భూమి పైకి వస్తుందని భావిస్తారు .ఇలా ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల అన్ని శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

కార్తీక మాసంలో ఉసిరి చెట్టును సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావించి తులసినీ లక్ష్మీదేవిగా భావిస్తారు.ఈ క్రమంలోనే వీటికి వివాహాన్ని కూడా జరిపిస్తారు.అలాగే ఎంతో పవిత్రమైన ఈ కార్తీకమాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి.మన స్థాయి కొద్ది దానధర్మాలను చేయటం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చునని పండితులు చెబుతున్నారు. అలాగే కార్తీక మాసంలో చేసే దాన,ధర్మాలు అశేష ఫలితాన్ని చేకూరుస్తాయి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×