BigTV English

Govt Provides Solar:ఆ రాష్ట్రంలో ఇంటింటికి ఉచితంగా సోలార్..

Govt Provides Solar:ఆ రాష్ట్రంలో ఇంటింటికి ఉచితంగా సోలార్..

Govt Provides Solar:ఇప్పటికే భారత్‌లో ఎన్నో టెక్నాలజీలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. కొన్ని టెక్నాలజీలు ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంటే.. మరికొన్ని మాత్రం తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నాయి. తాజాగా దేశంలో మరో టెక్నాలజీ ప్రజలకు ఉచితంగా అందజేయడానికి ఓ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది.


సోలార్ అనేది విద్యుత్తు రంగంలో ఓ కొత్త అధ్యాయానానికి శ్రీకారం చుట్టింది. విద్యుత్తు వినియోగాన్ని అదుపులో ఉంచడానికి, ప్రజలపై కరెంటు బిల్లు భారం ఎక్కువగా పడకుండా ఉండడానికి సోలార్ అనేది తయారు చేశారు పరిశోధకులు. ఇప్పటికే చాలామంది ఈ సోలార్ సాయంతో విద్యుత్తును వినియోగిస్తున్నారు. కానీ దీనికి పెట్టే ఖర్చు మాత్రం ఒక మధ్య తరగతి కుటుంబానికి భారంగానే అనిపిస్తుంది. అందుకే వారు సోలార్ వైపుకు ఎక్కువగా మొగ్గుచూపడం లేదు.

దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు అయ్యాయి. అందులో కొన్నింటి బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. అయితే ఈ సోలార్ ప్లాంట్స్ సాయంతో ఇంటింటికి సోలార్ అందించాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ ఆలోచనకు ముందడుగు వేసింది ఛండీగఢ్ ప్రభుత్వం. ఇటీవల నార్త్‌లోనే మొదటి సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఛండీగఢ్ ప్రభుత్వం.. అందరికీ సోలార్‌ను అందించే ప్రయత్నాలు మొదలుపెట్టింది.


ఏప్రిల్‌ నుండి ఛండీగఢ్‌లోని ప్రతి ఇంటిపై సోలార్ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దేశంలో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్న మొదటి రాష్ట్రంగా ఛండీగఢ్ పేరు సాధించనుంది. ఒక ఇంటి నుండి మరో ఇంటికి సోలార్ కనెక్షన్స్ ఏర్పాటుకు ఇప్పటికే సన్నాహాలు పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఓ ప్రైవేట్ సంస్థ ఈ సోలార్ ప్లాంట్స్ తయారీకి, ఏర్పాటుకు బాధ్యత వహించనుంది.

సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేవరకు యూనిట్‌కు రూ.3.23 కరెంటు బిల్లును ఇంటి ఓనరు కట్టాల్సి ఉంటుంది. కానీ ప్లాంట్ ఏర్పాటయిన తర్వాత ఆ బాధ్యతను ఓనర్‌కు ఉచితంగా అప్పగించనుంది ప్రభుత్వం. 2016లోనే ఈ ఛండీగఢ్ ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. ప్రస్తుతం 3,125 ఇళ్లపై ఈ సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు జరగనుంది.

Google:గూగుల్ కొత్త అప్డేట్.. ఇంకాగ్నిటో కోసం..

 ornaments: 2500 ఏళ్లనాటి ఆభరణాలు.. తవ్వకాల్లో

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×