E-Paper
Advertisement

Jagan: సీఎం జగన్ ఢిల్లీ టూర్ కి ఆటంకం.. విమానంలో లోపం.. అదేనా ప్రాబ్లమ్?

Jagan: సీఎం జగన్ ఢిల్లీ టూర్ కి ఆటంకం.. విమానంలో లోపం.. అదేనా ప్రాబ్లమ్?
Advertisement

Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ బయలు దేరారు. తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం వెళ్లారు. సాయంత్రం 5:03 కి విమానం ఎక్కారు. ఫ్లైట్ టేకాఫ్ అయింది. సీఎంకు సెండాఫ్ పలికిన అధికారులు రిటర్న్ అయ్యారు. కట్ చేస్తే…

ఢిల్లీ వెళ్లాల్సిన ఆ విమానం తిరిగి 5:26 కల్లా మళ్లీ గన్నవరం విమానాశ్రయంలోనే ల్యాండైంది. ఈసారి ఎమెర్జెన్సీ ల్యాండ్. విషయం తెలిసి అంతా హడలిపోయారు.

Advertisement

విమానంలో సీఎం జగన్ తో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డిలు ఉన్నారు.

ఫ్లైట్ గన్నవరం నుంచి బయలు దేరాక.. విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్టు గుర్తించారు పైలైట్. వెంటనే రిటర్న్ తీసుకుని.. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రమాదం ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

విమానంలో లోపం ఇప్పటికిప్పుడు సరిదిద్దే సమస్య కాకపోవడంతో తాడేపల్లికి తిరిగి వెళ్లిపోయారు సీఎం జగన్. సోమవారం నాటి ఢిల్లీ టూర్ రద్దు చేసుకున్నారు. మంగళవారం ఉదయం మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు.

సీఎం జగన్ ప్రయాణిస్తున్న స్పెషల్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తడాన్ని సెక్యూరిటీ వింగ్ సీరియస్ గా తీసుకుంది. వెంటనే విచారణకు ఆదేశించింది. విమానంలో ఏసీ పని చేయట్లేదని తెలుస్తోంది.

Related News

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

Big Stories

Advertisement
×