E-Paper
Advertisement

Human Brain : వాతావరణానికి తగ్గట్టుగా .. మనిషి మెదడు ఎలా మారుతుందో తెలుసా?

Human Brain : వాతావరణానికి తగ్గట్టుగా .. మనిషి మెదడు ఎలా మారుతుందో తెలుసా?
Advertisement
Human Brain

Human Brain : వాతావరణ మార్పులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దాని వల్ల పలు విధాలుగా మానవాళికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత కొన్నేళ్లుగా వీటిని అదుపులోకి తీసుకురావడానికి శాస్త్రవేత్తలు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా.. రోజురోజుకీ పరిస్థితులు ఇంకా దారుణంగా మారుతూనే ఉన్నాయి. అయితే ఈ వాతావరణ మార్పుల వల్ల మనుషులపై మానసిక ప్రభావం కూడా పడుతుందని శాస్త్రవేత్తలు ఇటీవల బయటపెట్టారు.

Advertisement

ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడం, గ్లోబల్ వార్మింగ్ అనేది మానవాళిపై ప్రభావం చూపిస్తుందని తెలుసు కానీ స్పష్టంగా వారిపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనే విషయం చాలామందికి తెలియదు. అయితే వీటి వల్ల మనుషులు మానసికంగా కూడా దెబ్బతింటారని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వాతావరణ మార్పులు అనేవి మనిషి మెదడు పెరుగుదలను ఆపేస్తాయని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు గమనించారు. 50 వేల ఏళ్ల క్రితానికి సంబంధించిన డేటాను స్టడీ చేసినప్పుడు శాస్త్రవేత్తలు ఈ విషయాలను తెలుసుకున్నారు.

వాతావరణ మార్పులు అనేవి మనిషి మెదడుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే విషయాన్ని శాస్త్రవేత్తలు తాజాగా స్టడీ చేశారు. మనిషి మెదడుతో పాటు వాతావరణ మార్పుల వల్ల మనిషి ప్రవర్తనపై కూడా ప్రభావం పడే ఛాన్స్ ఉందని కనిపెట్టారు. 50 వేల ఏళ్ల క్రితం నాటి మనిషి అస్తికలను, అప్పటి వాతావరణ మార్పుల రికార్డ్స్‌ను పరీక్షించి చూశారు. వాతావరణం వేడిగా మారుతున్నకొద్దీ మనిషి మెదడు చిన్నగా అవుతూ వస్తోందని తెలుసుకున్నారు. చల్లగా ఉన్న వాతావరణంలో మనిషి మెదడు మామూలు సైజ్‌లోనే ఉందని.. వేడిగా మారుతున్నకొద్దీ దాని సైజ్ తగ్గిపోతుందని గమనించారు.

Advertisement

కేవలం ఉష్ణోగ్రత మాత్రమే కాదు.. హ్యుమిడిటీ, వర్షపాతం వంటివి కూడా మనిషి మెదడును ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు. ఇవన్నీ ఆగాలంటే వాతావరణం మామూలుగా మారాలని, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోకుండా ఉండాలని శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకోసం వారు ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రతీ ఒక్కరూ వాతావరణ మార్పులను అదుపు చేయడం తమ బాధ్యతగా భావిస్తేనే.. అనుకున్న టార్గెట్‌ను రీచ్ అవుతామని అన్నారు. వాతావరణ మార్పులతో పాటు కల్చర్, టెక్నాలజీ లాంటి అంశాలు కూడా మనిషి మెదడు సైజ్‌పై ప్రభావం చూపిస్తాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×