BigTV English

AP BJP: సోముపై వేటుకు 10 రీజన్స్‌.. జనసేన, టీడీపీ ఇంపాక్ట్!

AP BJP: సోముపై వేటుకు 10 రీజన్స్‌.. జనసేన, టీడీపీ ఇంపాక్ట్!
pawan-kalyan-chandrababu-somu-veerraju

AP BJP: అనుకున్నట్టుగానే జరిగింది. సోము వీర్రాజుపై వేటు పడింది. ఎన్నికల ముందు బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. సోము స్థానంలో సత్యకుమార్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడం మరింత వ్యూహాత్మకమని అంటున్నారు.


సోము వీర్రాజు.. సీఎం జగన్‌కు పరోక్ష సపోర్ట్ ఇస్తుంటారనే విమర్శ ఉంది. బీజేపీ అధ్యక్షుడిగా ఉంటూ.. అధికారపార్టీని కాకుండా.. మరో ప్రతిపక్ష పార్టీ టీడీపీనే ఎక్కువ టార్గెట్ చేస్తుండేవారు. చంద్రబాబుపైనే మాటల తూటాలు వదిలేవారు. అధిష్టానం ఎన్నిసార్లు చెప్పినా.. రాజధాని అమరావతి కోసం గొంతెత్తింది లేదు..పోరాడింది లేదు. ఏపీలో ఆలయాల విధ్వంసం, రథం దగ్థం లాంటి ఘటనలు జరిగినా.. పార్టీ తరఫున ఉద్యమించింది లేదు. బీజేపీని బలోపేతం చేసింది అంతకన్నా లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన పదవిలో ఉన్న కాలంలో.. బీజేపీ ఏ ఒక్క ఎన్నికలోనూ గెలవలేదు. అంతెందుకు.. కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేదు. ఆయన పదవిలో ఉన్నా.. లేనట్టే అన్నట్టు ఉన్నారు.

ఏపీ బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. సోము వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డి తదితరులతో కూడిన వైసీపీ అనుకూల వర్గం ఒకటి. సుజనా చౌదరి, సీఎం రమేశ్ లాంటి వారు టీడీపీ సానుకూల టీమ్‌గా ముద్రపడింది. గ్రూపులను వీర్రాజే ఎంకరేజ్ చేశారని అంటారు. సోము రాజకీయం నచ్చకే.. కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడిపోయారని చెబుతారు. ఆయన అధ్యక్షుడు అయ్యాక.. పాతవారిని పదవుల నుంచి తప్పించారు. తన వర్గాన్ని నెత్తిన పెట్టుకున్నారని అంటారు.


ఇక.. బీజేపీ, జనసేనల మధ్య మిత్రభేదానికి సోము వీర్రాజే కారణమంటారు. పవన్‌ను అసలేమాత్రం పట్టించుకోలేదు బీజేపీ. ఏనాడూ జనసేనతో సఖ్యతగా ఉండలేదు. సోము ఇగో వల్లే.. పవన్ బాగా హర్ట్ అయ్యారని చెబుతారు. వీర్రాజు వ్యవహార తీరుపై జనసేనాని బహిరంగంగానే విమర్శలు చేశారు.

అలా అలా.. ఆయన వైఫల్యాలన్నీ పండి.. ఇప్పుడు అధ్యక్ష మార్పునకు దారి తీసింది. ఎన్నికల వేళ.. కీలక నిర్ణయం తీసుకుంది. సోమును మార్చడం.. వైసీపీకి ఇబ్బందికర పరిణామమే. మొత్తానికి టీడీపీకి రూట్ క్లియరే!

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×