BigTV English
Advertisement

Daily Astrology : నేటి రాశిఫలాలు.. ఈ సమయంలో బయటకి వెళ్లొద్దు..!

Daily Astrology : నేటి రాశిఫలాలు.. ఈ సమయంలో బయటకి వెళ్లొద్దు..!

Daily Astrology : జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు కొందరు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. అటువంటి వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.


శ్రీ శుభకృతు నామ సంవత్సరం పుష్య మాసం. వారపు రోజు ఆదివారం. తిథి : ఏకాదశి రా . 7.26వరకు. నక్షత్రం : రోహిణి రా. 3.52వరకు. కరణం : వణిజ ఉ. 9:46 వరకు. యోగం : శుక్ల ప. 12:22 వరకు తదుపరి బ్రహ్మ. సూర్య సమయం : సూర్యోదయము – ఉ. 6:39, సూర్యాస్తమానము – సా. 5:44. అననుకూలమైన సమయం : రాహు – ఉ. 9:38 – 11:02. యమగండం – 12:00PM-1:30PM . దుర్ముహూర్తం – సా . 4.27 – 5. 12 . వర్జ్యం : రా.7.38-9 . 17 . శుభ సమయం : అభిజిత్ ముహుర్తాలు – 12:05 – 12:49.

మేష రాశి : ఈ రాశి వారు జీవితంలో కొన్ని ప్రధాన అడ్డంకులు తొలగిపోతాయి. మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం విజయవంతం కానుంది. వ్యాపారంలో ఆశించిన ప్రయోజనాలను ఉంటాయి. ప్రేమ, భాగస్వామితో సంబంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.


వృషభ రాశి : ఈ రాశి వారు అనవసర వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రత్యర్థులు మీ లక్ష్యాల నుండి మిమ్మల్ని మళ్లించడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. పనిని పూర్తి చేయడానికి అదనపు శ్రమ అవసరం. కుటుంబ సభ్యులతో ఏదో ఒక విషయంలో వాగ్వివాదం జరుగుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

మిధున రాశి : ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. వ్యాపారంలో భారీ లాభాలు పొందుతారు. ఆత్మీయుల రాక వల్ల ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకుంటే కడుపు సంబంధిత సమస్యలు రావొచ్చు.

కర్కాటక రాశి : ఈ రాశి వారు మనస్సు, మాట, ప్రవర్తనను అదుపులో ఉంచుకోవాలి. అనవసర సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని సమస్యలపై సహోద్యోగులతో వాగ్వాదం జరగొచ్చు. ఉద్యోగం కోసం చూస్తుంటే శుభవార్త వింటారు. మనసు చదువుల నుండి మల్లుతుంది.

సింహ రాశి : వ్యాపారానికి సంబంధించి చేపట్టే ప్రయాణాలు విజయాన్ని అందిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరించాలనే కోరిక నెరవేరుతుంది. భాగస్వామితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైన బహుమతిని పొందొచ్చు.

కన్య రాశి : ఈ రాశి వారికి చాలా రంగాల్లో కలిసొస్తుంది. కొన్ని పని సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. లక్ష్యాన్ని సాధించడానికి అదనపు కృషి అవసరం. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు నిరీక్షణ పెరుగుతుంది. అనుకున్న పనులను పూర్తి చేయడంలో ఆరోగ్యం ఆటంకంగా మారుతుంది. భూమి లేదా భవనానికి సంబంధించిన విషయాలు ఆందోళన కలిగించొచ్చు.

తులా రాశి : ఈ రాశి వారు వ్యాపారాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటారు. జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తుతాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలకు కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది. మతపరమైన ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. శత్రువులు చురుకుగా మారుతారు. కాబట్టి వారి నుంచి అప్రమత్తంగా ఉండాలి. ప్రణాళికలను పూర్తి చేయడానికి ముందు వాటిని బహిర్గతం చేయవద్దు. డబ్బు లావాదేవీలలో చాలా జాగ్రత్తగా చేయాలి.

ధనుస్సు రాశి : ఈ రాశి వారు కుటుంబంతో కలిసి పర్యాటకానికి వెళ్ళొచ్చు. ప్రయాణం వినోదాత్మకంగా ఉంటుంది. అనుకున్న విజయాలు సాధిస్తారు. పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. కోరికలు నెరవేరుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

మకర రాశి : ఈ రాశి వారు లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. ఇతర విషయాలపై శ్రద్ధ వహించొద్దు. జేబులో నుండి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో స్థిరపడాలని లేదా ఉపాధి పొందాలని ప్రయత్నిస్తున్నట్లయితే.. మరికొంత కాలం వేచి చూడాలి. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

కుంభ రాశి : ఈ రాశి ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా మారుతుంది. జీవితంలో ముందుకు సాగడానికి మంచి అవకాశాలను పొందొచ్చు. ప్రభావవంతమైన వ్యక్తిని కలవడం వల్ల భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాలను పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్త వింటారు.

మీన రాశి : ఈ రాశి వారు అవమానాలు నుంచి దూరంగా ఉండాలి. ఆందోళన కలిగించే సమస్యలు ఎదురవుతాయి. మీ భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. పాత స్నేహితులని కలుసుకునే అవకాశం ఉంది.

Related News

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Big Stories

×