BigTV English
Advertisement

Daily Astrology : నేటి రాశిఫలాలు.. యమగండం ఎప్పుడంటే..!

Daily Astrology : రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు . వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. అటువంటి వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Daily Astrology : నేటి రాశిఫలాలు.. యమగండం ఎప్పుడంటే..!

Daily Astrology : రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది.. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. అటువంటి వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.


శ్రీ శుభకృతు నామ సంవత్సరం పుష్య మాసం. వారపు రోజు సోమవారము. తిథి : ద్వాదశి రా . 7.51వరకు. నక్షత్రం : మృగశిర తె .4.58వరకు. కరణం : బవ ఉ. 9:06 వరకు. యోగం : బ్రహ్మ ఉ. 10:37 వరకు తదుపరి ఇంద్ర . సూర్య సమయం : సూర్యోదయము – ఉ. 6:38. సూర్యాస్తమానము – సా. 5:46. అననుకూలమైన సమయం : రాహు – సా. 4:41 – 6:05. యమగండం – 10:30 AM-12:00PM. దుర్ముహూర్తం – మ . 12.42 – 1:27,మ . 2.57 – 3.43 . వర్జ్యం – రా. 9.44 -11.24 . శుభ సమయం : అభిజిత్ ముహుర్తాలు – 12:04 – 12:49.

మేష రాశి : ఈ రాశి వారు ఏదో భ్రమలో చిక్కుకున్నట్లు అనిపించవచ్చు. మీరు సాధించాలనుకున్న వాటికి కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు. ఒకరి దృష్టిని ఆకర్షించడానికి మీరు కొత్త మార్గాలను కనుగొనాలి. మీ మాటలు ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలనే కోరికతో ఒక మార్గాన్ని కనుగొనవచ్చు. వ్యాపార ఆలోచనలకు దూరంగా ఉండాలి.


వృషభ రాశి : ఈ రాశి వారు వచ్చిన ఏ సూచననైనా అంగీకరించే రోజులు పోయాయి. బాధలను అధిగమిస్తారు. మనసులోని మాటలు మీ ముఖ్యులతో పంచుకోండి. ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. పాత భయాలు తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు సంతోషాన్ని కలిగిస్తాయి. కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు. మీ ఆలోచనలను మెరుగుపరుచుకోవాలి.

మిధున రాశి : ఈ రాశి వారు ఒకే పని కోసం ఎక్కువగా కష్టపడవచ్చు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అభివృద్ధి చెందుతున్న తేలికపాటి చికాకు మరికొంత కాలం కొనసాగవచ్చు. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాలను కొనసాగిస్తారు.

కర్కాటక రాశి : ఈ రాశి వారు కొత్త ఆలోచనలతో నిండిపోయినట్లు కనిపిస్తోంది. కానీ ప్రస్తుతం వాటికి దిశా నిర్దేశం లేదు. మీరు ఇతరుల సలహాలతో కొన్ని రంగాల్లో రాణించొచ్చు. రొమాంటిక్‌ రిలేషన్‌ కోసం మరింత క్వాలిటీ టైమ్‌ స్పెండ్‌ చేయాల్సి రావచ్చు. మీ జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. పరిస్థితిని నియంత్రించకపోతే వాదన జరిగే అవకాశం ఉంది.

సింహ రాశి : ఈ రాశి వారు మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులకు చికాకు కలిగించవచ్చు. మీ ఉద్దేశ్యం స్పష్టంగా ఉన్నప్పటికీ.. కమ్యూనికేట్ చేసే పద్ధతిలో మార్పు అవసరం. అధికారంలో ఉంటే.. మీరు ఆ అభిప్రాయాన్ని స్పష్టంగా కొనసాగిస్తారు. వ్యాపారంలో ఉంటే లాభాలు చూడొచ్చు. లోహాల వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు రావచ్చు. మీ వ్యూహాలు ఇతరులపై పని చేయకపోవచ్చు.

కన్య రాశి : ఈ రాశి వారు గతానికి సంబంధించిన కొన్ని బలమైన జ్ఞాపకాలు మీ రోజును ప్రభావితం చేస్తాయి. మీ నుంచి కొన్ని తప్పులు జరిగే ప్రమాదం ఉంది. ఆందోళన కలిగించే విషయాలలో మీరు స్పష్టత పొందలేకపోతే ఎవరైనా సలహా తీసుకోవచ్చు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వివారయాత్రలు ఉంటే ముందుగా ప్లాన్ చేసుకోండి. మీకు మంచి వ్యాపార మార్గదర్శకత్వం ఇచ్చే వ్యక్తిని మీరు కలిసే అవకాశం ఉంది.

తులా రాశి : ఈ రాశి వారి నైపుణ్యాలను మీ మిత్రుడు ఉపయోగించుకోవచ్చు. మీ రోజు డల్‌గా ఉండొచ్చు. కొత్త అవకాశం కోసం వెతకవచ్చు. ఎవరైనా మీకు సలహా ఇవ్వవచ్చు. మీ విధానం, వైఖరిలో చిన్న మార్పు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు తొందరపాటు వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. పనులు నిర్ధిష్ట విధానంలో జరుగుతాయి. మీపై కుటుంబ సభ్యులకు నమ్మకం ఏర్పడుతుంది. పనిలో స్వల్ప అశాంతి కాలం ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీ మనసులోని ఆలోచనలే మీ దృష్టిని తరచుగా మరల్చవచ్చు. మీరు వాటిని ఎక్కువగా పట్టించుకోకుండా ఉండండి. స్ట్రైట్‌ లైన్‌లో ముందుకు సాగాల్సిన సమయం.

ధనుస్సు రాశి : ఈ రాశి వారు గతంలో చేసిన చిన్న చిన్న తప్పులు సద్దుమణుగుతాయి. కుటుంబ సభ్యులు రక్షణ ఇస్తారు. మీ పనిలో ముందుగు సాగుతారు. కానీ ఎక్కువకాలం పని ఉండదు. డెడ్‌లైన్స్‌తో పని చేయడం వలన మీరు అలసిపోవచ్చు. ఒకవేళ మీరు చట్టపరమైన కేసులో చిక్కుకుంటే.. వాటి నుంచి విముక్తి లభిస్తుంది. కొందరు సన్నిహితులు మీ చుట్టూ ఉన్న రహస్య సమాచారాన్ని ఇతరులకు అందించడంలో కీలకంగా ఉండవచ్చు.

మకర రాశి : ఈ రాశి వారు జీవితం గురించి ప్లాన్ చేసుకుంటే చాలా మంచి సమయం కానుంది. వ్యాపార ఆలోచనలు ఫలితాలను ఇస్తాయి. భాగస్వామితో సంతోషంగా ఉంటారు. సహాయాన్ని కూడా అందిస్తుంది. అధికారికంగా వచ్చిన మ్యారేజ్‌ ప్రపోజల్‌ ఫలవంతం కావచ్చు. మీ మనస్సు స్పష్టంగా క్రమబద్ధీకరించబడినట్లు అనిపించవచ్చు. పాత స్నేహితులతో గడిపేందుకు మీకు ఇది అనుకూల సమయం.

కుంభ రాశి : ఈ రాశి వారు అధునాతన అధ్యయనాలను ప్లాన్ చేస్తున్నప్పుడు కొన్ని కష్టాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. పురోగతికి ఇప్పుడు సమయం అనుకూలంగా ఉండవచ్చు. ఆర్థికసాయం మీ దారికి వచ్చే అవకాశం ఉంది. ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంది. మంచి వ్యాయామ దినచర్య ఇప్పుడు అవకాశంగా మారవచ్చు. మీ ఆరోగ్యం మిమ్మల్ని తాత్కాలికంగా చికాకు పెట్టవచ్చు.

మీన రాశి : ఈ రాశి వారు కొత్త వర్క్‌ కోసం సన్నిహిత ఫ్యామిలీ ఫ్రెండ్‌ ఏదైనా సలహా ఇవ్వవచ్చు. పనిపై మీ దృష్టిని ఉంచుతారు. ఆశించిన ఫలితాలను పొందుతారు.కొత్త వ్యక్తులకు మీపై ఉన్న అభిప్రాయం.. మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది కలిగించొచ్చు. ఒక చిన్న పర్యటన ఆశాజనకంగా ఉండవచ్చు.

Related News

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Big Stories

×