Grass : సూర్యగ్రహణమైనా, చంద్ర గ్రహణమైనా గుర్తొచ్చేది దర్భలే. యజ్ఞయాగాదుల్లోను , అపరకర్మలకు శుకర్మలకు వివిధ రకాలు దర్భలను వాడతారు. దర్భ ఆవిర్భావం వెనుక చాలా కథలున్నాయి. మనకున్న పవిత్రమైన వృక్ష సంపదల్లో గడ్డి జాతికి చెందిన దర్భ ముఖ్యమైనది.
దర్భ విశ్వామిత్రుని సృష్టిగా చెబుతారు. క్షీరసాగర మథనం సందర్భంలో పర్వతరాపిడి కూర్మము ఒంటి మీద కేశములు సముద్రంలో కలిసిపోయి
మెల్లిగా ఒడ్డుకు కొట్టుకుపోయి కుశముగా మారాయని అమృతం వచ్చినప్పుడు
కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డిపైన పడటం వల్ల వాటికి అంత పవిత్రత వచ్చిందని చెబుతారు. ఈదర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు
శరీర కేశములని వరాహ పురాణం చెబుతోంది.
ధర్బగడ్డి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్ముతారు. విరోచనాలు, రక్తస్రావం, మూత్ర పిండాలలో రాళ్లు, మూత్ర విసర్జనలో లోపాలు మొదలైన వానికి మందుగా వాడుతున్నారు.
గ్రహణాల సమయంలో శిరస్సు మీద పిడెకడు దర్భలైనా కప్పుకుంటే , చెడు కిరణాల ప్రభఆవం ఉండదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. దర్భ కొనలుతేజమును కలిసి ఉంటాయి. సూర్య,చంద్ర గ్రహణాల సమయంలో కొన్ని హానికరమైన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని విజ్ఞానశాస్త్రం చెబుతోంది. ఇలాంటి హాని కరమైన కిరణాల దర్భల కట్టల మధ్యలో నుంచి ప్రయాణించలేవని పరిశోధనల్లో కూడా తేలింది.
పూర్వం ఆటవిక జాతులు తమ ఇళ్లను దర్భగడ్డితోనే నిర్మించుకునే వారు. ఈవిషయాన్ని మన మహర్షులు కూడా గుర్తించి గ్రహణ సమయంలో ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్లకప్పులను దర్భగడ్డితో కప్పుకోమని శాసనం చేశారు. కాలక్రమంలో ఇది మార్పు చెంది ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరుచుకుని మనం పనికానిచ్చేస్తున్నాం. ఈరోజుల్లో నగరాలు, పట్టణాలు దర్భగడ్డి ప్రజలు నానాపాట్లు పడుతున్నారు