BigTV English

‘Dear Uma’ Movie: ఇండిపెండెన్స్ డే స్పెషల్ స్టిల్‌తో ఆకట్టుకుంటున్న.. ‘డియర్ ఉమ’

‘Dear Uma’ Movie: ఇండిపెండెన్స్ డే స్పెషల్ స్టిల్‌తో ఆకట్టుకుంటున్న.. ‘డియర్ ఉమ’

‘Dear Uma’ Movie: తెలుగమ్మాయిలకు టాలీవుడ్ లో అంత ఈజీగా అవకాశాలు దొరకవు అని చెబుతుంటారు. ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోరు అనే వాదనలు కూడా వినే ఉంటారు. ఇతర రాష్ట్రాలకు చెందినవారిని తీసుకువచ్చి టాలీవుడ్ లో ఎంకరేజ్ చేస్తుంటారని చెబుతుంటారు. ఈ క్రమంలోనే తెలుగమ్మాయిలకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా వేస్టే.. కైవలం సైడ్ యాక్టర్స్ గానే పరిగణిస్తారు తప్ప హీరోయిన్లుగా అవకాశాలు ఇవ్వరు అని అంటుంటారు. ఇందుకు సంబంధించి చాలామంది యాక్టర్స్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, వీటిన్నిటికి ముగింపు చెబుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేయబోతున్నది మన తెలుగింటి అమ్మాయి. తన టాలెంట్ తో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ ట్రెండింగ్ ను క్రియేట్ చేయబోతున్నది.


అదేమంటే.. సుమయా రెడ్డి అనే ఏపీలోని అనంతపురంకు చెందిన తెలుగమ్మాయి ‘డియర్ ఉమ’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నది. ఈ చిత్రంలో తానే హీరోయిన్ గా, నిర్మాతగా పని చేస్తున్నది. ఈ విధంగా రెండు కీ రోల్స్ ప్లే చేయడం అంటే మాములు విషయం కాదు. నిర్మాతగా, హీరోయిన్ గా, కథా రచయితగానూ ఇండస్ట్రీలో తన సత్తాను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమాకు సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వం వహించారు. అయితే, ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, టీజర్, పాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.

ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఆడియన్స్ అంచనాలను భారీగా పెంచుతూ తెగ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడుబోతున్నారంటూ చిత్ర బృందం చెబుతున్నది. ఈ చిత్రంతో కథా రచయితగా సుమయా రెడ్డి తన అభిరుచిని చాటుకోబోతున్నారు. అయితే, ఇండిపెండెన్స్ డే సందర్భంగా సుమయా రెడ్డి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఎంతో ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం ఈ సినిమా టీం పోస్ట్ ప్రొడ7న్ పనుల్లో బిజీ బిజీగా ఉంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.


Also Read: ఈ నాలుగు సినిమాల్లో విన్నర్ ఎవరు? ‘బుక్ మై షో’లో ఆ మూవీకే ఎక్కువ ఓట్లు, రేటింగులో వెనుకబడింది ఎవరో తెలుసా?

కాగా, నిర్మాతగా సుమయా రెడ్డికి ఇది ఫస్ట్ మూవీ అయినా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎంతో రిచ్ గా నిర్మించారని చెబుతున్నారు పలువురు యాక్టర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ప్రథ్వీ అంబర్ ఈ సినిమాలో హీరోగా నటించగా, రధన్ సంగీతం అందించారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×