BigTV English

CM Revanth Reddy: మామా అల్లుళ్లు చెల్లని కాసులే.. హరీశ్ రావుకు చీము నెత్తురు ఉంటే.. : సీఎం ఫైర్

CM Revanth Reddy: మామా అల్లుళ్లు చెల్లని కాసులే.. హరీశ్ రావుకు చీము నెత్తురు ఉంటే.. : సీఎం ఫైర్

Independence Day: ఉమ్మడి ఖమ్మం జిల్లా వరదాయిని అయిన సీతారామ ప్రాజెక్టును గురువారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్‌ను స్విచ్ ఆన్ చేసి గోదావరి జలాల ఎత్తిపోతలను సీఎం ప్రారంబించారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలను వదిలారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రాజెక్టును రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. రెండు దశాబ్దాల క్రితం రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ పేర్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు దశాబ్దాల నిరీక్షణ తర్వాత తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి కావటం విశేషం. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు.


మూడు పంపులు…
తొలి దశలో ఏర్పాటు చేసిన మూడు పంపులలో తొలి పంప్‌హౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ములకలపల్లి మండలం కమలాపురంలో మూడో పంప్‌ హౌస్‌ను మంత్రి భట్టి విక్రమార్క స్విచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించారు. ఇంకా ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వక పోయినా మంత్రి తుమ్మలపై నమ్మకంతో లింక్ కెనాల్‌కు భూములిచ్చిన రైతులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

హరీశ్ కక్కుర్తి
కేసీఆర్ పది సంవత్సరాలు అధికారంలో ఉండి రూ.లక్షా 80 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వలేదని ముఖ్యమంత్రి విమర్శించారు. ఆరు నెలలు తాము చిత్తశుద్ధితో పనిచేస్తే నేడు ప్రాజెక్టు తొలిదశ పూర్తయిందని గుర్తుచేశారు. ప్రాజెక్టు కోసం తాము పడిన శ్రమను మాజీ మంత్రి హరీష్‌రావు చులకన చేసి మాట్లాడుతున్నారని, నిజంగా వారికి దీనిపై చిత్తశుద్ధి ఉండుంటే ఏడేళ్లలో ఎందుకు దీనిని పూర్తి చేయలేదో చెప్పాలని నిలదీశారు. తాము నిర్మించిన ప్రాజెక్టు నీళ్లను కాంగ్రెస్ నేతలు నెత్తిన చల్లుకుంటున్నారని హరీష్ రావు మాటలపై సీఎం ఫైరయ్యారు. ఆ గోదావరి తల్లే తమ మీద నీళ్లు చల్లిందని సెటైర్ వేశారు. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం పూర్తయిన ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికను చేపడుతామని క్లారిటీ ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవం నాడే ఖమ్మం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సీతారామ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని సీఎం అన్నారు.


Also Read: KTR: మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే.. బీజేపీతో పొత్తుపై కేటీఆర్ కామెంట్

చెల్లని రూపాయిలే..
హరీష్ రావు దూలంలాగా పెరిగారు కానీ బుద్ధి పెరగలేదని సీఎం ఎద్దేవా చేశారు. రీ డిజైన్ పేరుతో ప్రాజెక్ట్ అంచనాల పెంపు, ముందుగానే పంప్ మోటార్లు పెట్టటం, నాలుగేళ్లుగా పంప్ హౌస్‌కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవటం ఏంటని నిలదీశారు. పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్, హరీశ్‌రావు సీతారామ ప్రాజెక్టు డీపీఆరే ఇవ్వలేదని.. కమీషన్ల బాగోతం బయటపడుతుందనే అలా చేయలేదని రేవంత్ ఆరోపించారు. ప్రాజెక్ట్‌పై మామా అల్లుళ్లు బోగస్ మాటలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. తెలంగాణ వనరులను కేసీఆర్ కుటుంబం దోచుకుతిన్నదని, ఇక.. కేసీఆర్, హరీష్‌రావు చెల్లని రూపాయిలేనని సీఎం ఎద్దేవా చేశారు. వైరాలో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసిందని, హరీశ్ రావుకు చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయాలన్నారు.

ఏడేళ్ల నిరీక్షత తర్వాత..
ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగానే గోదావరి పారుతున్నా, ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లు అందే పరిస్థితి లేని క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో రూ.2,800 కోట్ల అంచనా వ్యయంతో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులుగా దీనిని ప్రారంభించారు. గత ప్రభుత్వం దీనిని రీడిజైన్ చేసి అంచనా వ్యయాన్ని రూ.18వేల కోట్లకు పెంచి, 2016లో శంకుస్థాపన చేసి తర్వాత ఏడేండ్లలో రూ.7,500 కోట్లు ఖర్చు చేశారు. కాల్వలను తవ్వినా.. మధ్యలో వాగులు, రోడ్లు అడ్డం వచ్చిన చోట బ్రిడ్జిలు, ఆక్విడెక్ట్‌లు, టన్నెల్స్ కట్టకుండా వదిలేశారు. నాలుగేండ్ల క్రితమే పంప్ హౌస్‌లలో మోటార్లను బిగించినా కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. 155 చోట్ల స్ట్రక్చర్లను పెండింగ్ పెట్టారు. ఇక ఫీడర్ చానళ్లు, డిస్ట్రిబ్యూటరీల వ్యవస్థలనూ వదిలేశారు. మొత్తం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలంటే స్ట్రక్చర్లు, టన్నెళ్ల నిర్మాణంతో పాటు ఇంకా రూ.10 వేల కోట్లు అవసరం. దీంతో అప్పటి వరకు పూర్తయిన పనులను సద్వినియోగం చేసుకుంటూ రూ.90 కోట్లతో ఏన్కూరు లింక్ కెనాల్‌ను నిర్మించి, గోదావరి నీటిని వైరా రిజర్వాయర్‌కు చేరేలా ప్లాన్ చేశారు. దీంతో తొలి విడతలోనే లక్షన్నర ఎకరాలకు గోదావరి నీళ్లందనున్నాయి.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×