E-Paper
Advertisement

Congress : మంత్రుల మధ్య విబేధాలు.. ప్రతిపక్షాలకు షాక్!

Congress : మంత్రుల మధ్య విబేధాలు.. ప్రతిపక్షాలకు షాక్!
Advertisement

అధికార కాంగ్రెస్ మంత్రివర్గం మీద ఇటీవల జోరుగా నెగెటివ్ ప్రచారం జరుగుతోంది.కేబినెట్ మంత్రులు చెబితే ఎవరూ వినరని, బ్యూరోక్రాట్స్ మాత్రమే కాకుండా తోటి మంత్రులు సైతం స్పందించరని ఇటీవల వార్తలు వస్తున్నాయి.అంతేకాకుండా, మంత్రుల మధ్య ఆధిపత్య పోరుతో పాటు పైసల పంపకాలు, అక్రమాల్లో పైచేయి కోసం ఒకరికొకరు ప్రయత్నిస్తున్నారని చర్చ జరిగింది. ఈ విషయాలపై ప్రతిపక్షాలు పెద్దఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. మంత్రుల మధ్య సఖ్యత లేదని, వసూళ్ల విషయంలో ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నది.ఈ విషయం కాస్త ముఖ్యమంత్రి వద్దకు వెళ్లగా ఆయన ఇద్దరు, ముగ్గురు మంత్రుల మీద సీరియస్ అయినట్టు తెలుస్తోంది.

శాఖలపై పట్టు లేదు..!

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఓ మంత్రి తన శాఖ గురించి ఏం సమాధానం ఇవ్వలేకపోయారని తెలిసింది. అనంతరం మరో సీనియర్ మంత్రి ప్రతిపక్షాలకు సమాధానం ఇచ్చారని.. ఆ తర్వాత శాఖపై పట్టుపెంచుకోకుండా ఏం చేస్తున్నావని, ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నావని కొత్తగా బాధ్యతలు తీసుకున్న మంత్రిపై.. సీనియర్ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై ప్రతిపక్షాలు స్పందిస్తూ.. సబ్జెక్టు లేకుండా ప్రభుత్వానికి కాకుండా తమకు అనుకూలంగా మాట్లాడిన మంత్రి మీద వీరు సెటైర్లు వేసినట్టు సమాచారం. ముఖ్యంగా సదరు మంత్రిని కేటీఆర్ అసెంబ్లీలో మాస్ ర్యాగింగ్ చేసినట్టు తెలిసింది. కాగా,అభివృద్ధి నిధుల కోసం సంబంధిత శాఖ మంత్రి వద్దకు వెళ్లితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరిగింది.

అధికారులూ అలాగే..

Advertisement

మంత్రుల పేషీలో పనిచేస్తున్న కొందరు సెక్రెటరీలు..తమ శాఖ మంత్రి కాకుండా.. ఇతర మంత్రులు ఏదైనా సిఫార్సు చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.నిధులు లేవని, మంత్రి లేరని మరల రావాలని మంత్రుల తరఫున వచ్చిన అధికారులను తిప్పి పంపుతున్నట్టు తెలుస్తోంది. కొందరికి శాఖల మీద పట్టులేకపోగా.. మరికొందరు కేవలం వ్యాపారాల మీద దృష్టి పెట్టారని..తమ నియోజకవర్గ ప్రజలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు మంత్రుల వ్యవహారంపై సీఎం సైతం అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ,ప్రక్షాళన ఉంటుందని సీఎం ఈ మధ్యే క్లారిటీ ఇచ్చారు.

హానర్ నుంచి మరో క్రేజీ ఫోన్.. సింగిల్ ఛార్జ్‌తో 65 గంటల బ్యాటరీ లైఫ్.. రేటు కూడా తక్కువే!

సీనియర్ మంత్రి క్లారిటీ..

Advertisement

రాష్ట్రంలో మంత్రుల మధ్య విబేధాలు ఉన్నాయని, సీఎంను సైతం వారు లెక్కచేయడం లేదనేది ఇటీవలి కాలంలో తరచూ వినిపిస్తున్న ఆరోపణ.అందుకే సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మీటింగు నిర్వహణ సమయంలో మంత్రులకు హెచ్చరికలు సైతంచేసినట్టు తెలిసింది. తాజాగా ఓ మంత్రి ఈ ఆరోపణలపై స్పందించారు. అసలు మంత్రివర్గంలో ఎటువంటి సమస్య లేదని, అందరం బాగానే ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు కుండబద్దలు గొట్టాడు. కావాలని ప్రతిపక్షాలు సర్కారు, మంత్రివర్గంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల అంశంపైనా శ్రీధర్ బాబు స్పందించారు.వచ్చే ఎన్నికల్లోపు పెండింగ్ హామీలను పూర్తిచేస్తామని ప్రకటించారు. తులం బంగారం, మహిళలకు రూ.2500 అందజేశాకే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. మంత్రి ప్రకటనతో ప్రతిపక్షాలకు షాక్ తగిలినట్టు అయ్యింది.మరోసారి దుష్ప్రచారం చేయొద్దని హితవు సైతం పలికారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×