Taraneh Alidoosti : కొన్ని రోజులుగా హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొంటున్న వారితో పాటు వారికి మద్దతు తెలపుతున్న వారిని కూడ ఇరాన్ ప్రభుత్వం దారుణంగా శిక్షిస్తోంది. తాజాగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనకు మద్దతు తెలింపిందంటూ ప్రముఖ నటీ ..2016లో ఆస్కార్ గెలిచిన ‘ది సేల్స్ మాన్’ మూవీ నటిని ఇరాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.
తరనేహ్ అలిదూస్తీ వక్రీకరించే కంటెంట్ పోస్టు చేస్తోందని అదుపులోకి తీసుకుంది. మీరు మౌనంగా ఉంటే అణచివేతదారులకు మత్తలు పలికినట్టే..ఈ రక్తపాతాన్ని చూస్తూ ఎలాంటి చర్యలు తీసుకోని అంతర్జాతీయ సంస్థలు మానవత్వానికి అవమానకరం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకోచ్చింది.